దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. ప్రధానంగా కరీంనగర్ సమీపంలోని గ్రామాల్లో కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. కొండాపూర్, దుర్శేడు, రేకుర్తి తదితర గ్రామాలన్ని వరద నీటి మయం కావడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రేకుర్తిలోని మైనార్టీ గురుకులం వద్దకు వచ్చి చేరిన నీటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. ఈ హాస్టల్ చుట్టూ వరద నీరు వచ్చి చేరిందని ఏఐఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ వివరించారు. విద్యార్థులకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే దుర్శేడు గ్రామంలోని పలు కాలనీల్లోకి వాన నీరు వచ్చి చేరడంతో జేసీబీల సాయంతో వాన నీటిని డైవర్ట్ చేసే పనిలో పంచాయితీ యంత్రాంగం నిమగ్నం అయింది. హుజురాబాద్… జూపాక రహదారిలోని కూడా వరద ఉధృతి తీవ్రం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపున జూపాక గ్రామంలోని పెద్ద చెరువు మత్తడి దూకడంతో స్కూల్ తో పాటు పలువురు ఇండ్లు జలమయం అయ్యాయి. వరద ఇలాగే కంటిన్యూ అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో గ్రామస్థులు భయపడుతున్నారు.