ప్రయుఖ గాయని వాణీజయరాం మృతిపై సస్పెన్స్ వీడింది. ప్రమాదవశాత్తూ గ్లాస్ టేబుల్ పై పడ్డారని, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా పోలీసులు వెల్లడించారు. సరైన సమయంలో చికిత్స అంది ఉంటే ప్రాణాలు కాపాడుకునేవారని తెలిపారు. వాణీజయరాం మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆమె శరీరంపై గాయాలు కనిపించడంతో అనేక అనుమానాలు కలిగాయి. బాత్రూమ్‌లో జారి కింద పడి పోవడం వల్ల చనిపోయారని తొలుత వార్తలొచ్చాయి.
వాణీజయరామ్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీబీ ఫుటేజీతో పాటు ఫోరెన్సిక్ టీమ్ వచ్చి ఇంట్లోని వస్తువులను పరిశీలించింది. క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. దీంతో పాటు పోస్టుమార్టం నివేదిక తర్వాత మిస్టరీ వీడింది. బెండ్ రూమ్ లోని గ్లాస్ టేబుల్ పై పడిపోవడంతో తలకు బలమైన గాయం అయిందని గుర్తించారు. కానీ ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండటంతో హాస్పిటల్ కు సకాలంలో తీసుకెళ్లలేదని, మృతికి అదే కారణమని చెప్పారు.
అలాగే ఇంటి దగ్గర సీసీ పుటేజీలను పరిశీలించిన అధికారులు.. అపార్ట్ మెంట్వద్ద ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని తెలిపారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించలేదని, ఆమె మరణించే సమయంలో డోర్ లోపల నుంచి లాక్ చేయబడిందని చెప్పారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించన కదిరికలు ఏమీ లేవని పోలీసులు తెలిపారు. ఈ నెల 4న చెన్నైలోని తన నివాసంలో వాణీజయరాం మరణించగా.. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
వాణి జయరాం ముఖంపై గాయాలు ఉండటంతో తొలతు ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పోలీసుల విచారణలో ప్రమాదవశాత్తూ గ్లాస్ టేబుల్ మీద పడి మరణించినట్లు తేలడంతో.. ఆమె మృతిపై మిస్టరీ వీడినట్లు అయింది. తెలుగుతో పాటు హిందీ,తమిళం, మలయాళం భాషల్లో వాణీజయరాం అనేక పాటలు పాడారు.ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.