దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఉత్తార భారతాన్ని ఇంకా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. తగ్గుముఖం పట్టినట్టే పట్టిన వానలు మళ్లీ ప్రారంభం కావడంతో వరద నీటి ప్రవాహంలో పలు ప్రాంతాలు కొట్టు మిట్టాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ హత్నికుండ్ బ్యారేజీ నిండిపోయింది. దీంతో ఈ బ్యారేజీ గేట్లను మళ్లీ తెరిచారు అధికారులు. యమునా నది మళ్లీ ప్రమాద కర స్థాయిని దాటి 206.42 మీటర్లకు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 206.7 మీటర్లకు చేరుకున్న తర్వాత వరద నీటి మట్టం స్థిరంగా ఉంటుంది సీడబ్లుసీ అధికారులు తెలిపారు. సెంటర్ వాటర్ కమిషన్ అంచనాలు తలకిందులై వరద మరింత పొటెత్తితే మాత్రం యమునా నది పరివాహక ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురవుతాయని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి వివరించారు. అయితే వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఇతరాత్య సేఫ్టీ కోసం చేపట్టాల్సిన చర్యల కోసం తమ ప్రభుత్వం అన్నింటా సిద్దంగా ఉందని ఆయన వివరించారు.