సర్పంచ్ ఆడియో వైరల్
దిశ దశ, చొప్పదండి:
పంచాయితీల్లో అభివృద్ది చేసిన అభివృద్ది పనుల కోసం అప్పులు చేసినా తమకు మాత్రం బిల్లులు రావడం లేదంటూ సర్పంచులు ఆవేదన చెందుతూనే ఉన్నారు. బిల్లులు ఇవ్వండి మహా ప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి పోతున్నామే తప్ప తమకు మాత్రం న్యాయం జరగడం లేదని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజా స్వామ్య వ్యవస్థలో కీలకమైన అధికారాలు ఉన్న గ్రామ సర్పంచ్ వ్యవస్థ నేడు అస్థవ్యస్థంగా మారిపోయింది. సర్కారు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసిన చేతికి చిల్లి గవ్వ కూడా రాకపోవడంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి వారికి ఎదురయింది. దీంతో ఒక్కో సర్పంచ్ తమ గోడు వెల్లబోసుకునేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ ఎంపీడీఓ ఆఫీసులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మరవక ముందే తాజగా మరో సర్పంచ్ ఆడియె నెట్టింట వైరల్ అవుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ మేఘరాజ్ విడుదల చేసిన ఈ ఆడియో గురించి చర్చనీయాంశంగా మారింది. నాలుగు సంవత్సరాల క్రితం గెలిచినా పంచాయితీ సెక్రటరీ లేడని, దీంతో గ్రామ అభివృద్ధి కుంటు పడుతోందన్న మోఘరాజ్ వారం రోజుల్లో సెక్రటరీని నియమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆడియోలో వెల్లడించారు. తన చావుకి కారణం జిల్లా పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారి,ఎంపివోలే కారణమంటూ ఆరోపణలకు దిగారు. వైకుంఠ ధామం నిర్మించి సంవత్సరం అయినా నేటికీ రికార్డు చేయలేదని, సెగ్రెషన్ షెడ్ఢు నిర్మించిన తరువార భారీ వర్షాలకి కూలిపోయిందన్నారు. అయితే కూలిన షెడ్డును మళ్లీ కట్టించాలని అధికారులు నా మెడపై కత్తి పెట్టడంతో నిర్మించినప్పటికీ రికార్డు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణం అరవై నాలుగు వేలు పెట్టి నిర్మిస్తే నలభై రెండు వేలు రికార్డు చేశారని, పదిహేను రోజుల్లో తన పని పూర్తి చేయకపోతే మండల అభివృద్ధి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని సర్పంచ్ మేఘరాజ్ హెచ్చరించారు. నా చావుతో అయినా సర్పంచులందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. వెంకటయ్య పల్లి సర్పంచ్ విడుదల చేసిన ఈ ఆడియో కరీంనగర్ జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్పంచ్ మేఘరాజ్ ఆడియో ద్వారా ఏం చెప్తున్నారో మీరూ వినండి…
Disha Dasha
1884 posts
Prev Post
Next Post