కరీంనగర్ లో మారథాన్ సెకండ్ ఎడిషన్… బ్రోచర్ ఆవిష్కరించిన కలెక్టర్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో సెకండ్ ఎడిషన్ మారథాన్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం అట్టహాసంగా చేపట్టిన మారథాన్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే విధంగా మారథాన్ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం మారథాన్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ రన్నర్స్ మరియు సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్, జిల్లా అధికార యంత్రాంగం నేతృత్వంలో మారథాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 22న జరపతలపెట్టిన ఈ మారథాన్ లో పాల్గోనాలనుకున్న ఔత్సాహికులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని నిర్వహకులు సూచించారు. 3k, 5k, 10k , 21Kలలో మొత్తం నాలుగు కేటగిరీల్లో మారథాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సారి స్థానిక అంబేడ్కర్ స్టేడియం నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. మారథాన్ లో పాల్గొన దల్చిన వారు https://knr24.iq301.com లో సెప్టెంబర్ 11లో గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ మారథాన్ లో పాల్గొన్న వారికి బ్రేక్ ఫాస్ట్, హైడ్రేషన్, టీషర్ట్, మెడల్, డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తామని కూడా వెల్లడించారు. మరింత సమాచారం కావల్సిన వారు 72592 65758, 81436 58008 లేదా 96764 99949 ఫోన్ నంబర్లలో కాంటాక్ట్ కావాలని సూచించారు.

You cannot copy content of this page