దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో వైన్ షాపుల వేలం ప్రక్రియకు సంబంధించిన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. 33 జిల్లాల వారిగా వైన్ షాపులను అప్పగించేందుకు అవసరమైన జీఓ విడుదల కానుంది. ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉండగా, అదే రోజు నుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ప్రారభం కానుండగా చివరి తేది 18గా డిసైడ్ చేసినట్టు సమాచారం. 20 లేదా 21న వైన్ షాపులకు సంబంధించిన లాటరీ తీయాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన రోజు ఫిక్స్ అయిన తరువాత జీఓ పూర్తి వివరాలతో కూడిన జీఓ విడుదల కానుంది. రాష్ట్రంలో 20ే21 వరకు 2216 షాపులు ఉండగా ఆ సంవత్సరం విడుదల చేసిన నోటిఫకేషన్ లో అదనంగా 404 షాపుల ఏర్పాటుకు క్లియరెన్స్ ఇచ్చి ఈ సంఖ్యను 2620కి పెంచారు. అయితే ఈ సంవత్సరం కూడా అదనంగా లిక్కర్ షాపులను పెంచుతారా లేక అప్పడు ఉన్న షాపులకే నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సారి వచ్చే నోటిఫికేషన్ లో నిభందనల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అన్న విషయం కూడా జీఓ విడుదల తరువాతే తెలియనుంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post