దేశంలోని పలు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ శనివారం రాత్రి ముగిసింది. దాదాపు 9 గంటలపాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. అయితే ఈ విచారణలో ఈడీ టీం కవితను ఏం ప్రశ్నించింది అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పిళ్లై, కవితలను ఒకే చోట కూర్చోబెట్టి విచారణ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ముందుగా మాత్రం ఈడీ అధికారులు మాత్రం ఇతరాత్ర ప్రశ్నలను సంధిస్తూ కవిత నుండి వివరాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. ఆమెను ప్రశ్నించిన విషయాల్లో ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేర్పులు చేసింది మీరేనా, ఇందులో ఎశరెవరి భాగస్వామ్యం ఉందని అడిగారు ఈడీ అధికారులు. ఢీల్లీ ప్రభుత్వానికి సౌత్ గ్రూపునకు మద్య మీడియేటర్ గా వ్యవహరించిది మీరేనా, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ తో మీకేం సంబధాలు ఉన్నాయి అన్న ప్రశ్నలు అడిగారు. లిక్కర్ స్కాంలో మీ పాత్ర ఎంత మేర ఉంది, అరుణ్ రామచంద్ర పిళ్లై మీ బినామీయేనా, ఆయన మీ ప్రతినిధినని చెప్పిన విషయంలో నిజమెంత, మనీష్ సిసోడియాతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, అసలు లిక్కర్ పాత్రలో మీ పాత్ర ఉందా లేదా అని అడిగారు. పిళ్లైకి, మీకు మధ్య జరిగిన ఆర్థిక లావా దేవీల వివరాలు ఏమిటీ, ఆయనతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్టేనని మీరు చెప్పారా లేదా, సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేమిటీ, ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా, ఆ డబ్బు ఎక్కడి నండి వచ్చింది..? మీకు ఎవరిచ్చారు అని ఈడీ బృందం ప్రశ్నించింది.
ఛార్డెడ్ ఫ్లైట్ సమకూర్చిందెవరు, లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా అని అడిగారు. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా, లేదా, శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు, ఆయనతో తరుచూ మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఆధారాలు చిక్కుండా ఉండేందుకేనా, గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ప్రధానమైన ప్రశ్నలతో పాటు మరిన్ని వివరాలను కూడా కవిత నుండి రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. పిళ్లై రిమాండ్ రిపోర్ట్, మాజీ అడిటర్ బుచ్చిబాబు వాట్సప్ ఛాటింగ్ కు సంబందించిన ప్రశ్నలను కూడా సంధించినట్టుగా తెలుస్తోంది. కవిత, పిళ్లైలను కాన్‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారించారని, అలాగే మిగతా 9 మందిని కూడా ఈడీ అధికారులు పలు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. కస్టడీలో ఉన్న లిక్కర్ స్కాం నిందితులను విడివిడిగా కూడా ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post