దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణాకే పరిమితం కాలేదని స్ఫష్టం అవుతోంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తన ఫ్రంట్ లో ఉన్న మరో పార్టీ కోసం కర్ణాటకలోనూ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ ను రంగంలోకి దింపిందని పోలీసుల విచారణలో తేలింది. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల కదలికలపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ లో భాగస్వామ్యంగా ఉన్న కుమారస్వామి కోసం ప్రత్యేకంగా మమకారం చూపించి తెలంగాణాకు చెందిన స్పెషల్ టీమ్ ను కర్ణాటకకు అక్కడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంపించినట్టుగా గుర్తించారు.
‘ఆర్కే’ లీల…
ఇకపోతే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మరో పోలీసు అదికారి రాధాకిషన్ వ్యవహారంపై వెలుగులోకి వచ్చిన విషయాలు విని పోలీసు ఉన్నతాదికారులూ నివ్వరెపోతున్నారు. చట్టం లేదు… నిభందనలు అంతకన్నా లేదు… రూల్ పోజిషన్స్ అయితే తమకు అసలే పట్టవు అన్నట్టుగా వ్యవహరించినట్టగా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. మల్కాజ్ గిరి ఏసీపీగా ఉన్నప్పుడు శ్రీధర్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో రాధాకిషన్ పేరు రాసి మరీ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ కేసులో పోలీసు యంత్రంగమే షాక్ అయ్యే విధంగా రాధాకిషన్ వ్యవహరించారు. తనపై ఉన్న కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసుకుని క్లోజ్ చేసేసుకున్నారు. వాస్తవంగా కేసులో ఆరోపణలు ఉన్న అధికారిని దర్యాప్తు నుండి పోలీసు ఆపీసర్లు తప్పిస్తుంటారు. అందునా బాధితుడు సూసైడ్ నోట్ రాసీ మరి చనిపోతే మరో స్టేషన్ కు బదిలీ చేసి దర్యాప్తు చేయడం కానీ పై అధికారుల పర్యవేక్షణలో విచారణ చేయడం కానీ చేస్తుంటారు. శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మాత్రం ఆరోపణలు ఎధుర్కొన్న అదికారే దర్యాప్తు చేసుకుని కేసును క్లోజ్ చేసుకోవడం విచిత్రంగా ఉంది. మరోవైపున ఈ కేసు విషయంలో ఆ పై అధికారులు కూడా పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రాసిన లేఖను సూసైడ్ నోట్ గా పరిగణించడంతో పాటు ఏసీపీ పేరే రాసినందున దర్యాప్తును ఏసీపీ కన్నా పైస్థాయి అధికారి విచారణ చేసేందుకు చొరవ తీసుకోకపోవడం కూడా పోలీసు అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపుతోంది.
ప్రణిత్ కేసులోనే…
ఫోన్ ట్యాపింగ్… సాక్ష్యాల తారుమారు కేసులోనే సస్పెండెడ్ డీఎస్పీ ప్రణిత్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగరావులను కూడా నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు చెప్పడం ప్రణిత్ రావు పాటించడం అన్నట్టుగా మారిపోయాయి నాటి పరిస్థితులు. వీరద్దరూ అడిగిన సమాచారాన్ని ట్యాపింగ్ ద్వారా సేకరించి ప్రభాకర్ రావుకు అప్పగించే వాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.