దిశ దశ, అంతర్జాతీయం:
ప్రంపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికాలోనూ భద్రతా చర్యల డొల్లతనం బయటపడింది. అంతర్జాతీయ సమాజం ముందు భద్రతా ప్రమాణాల్లో తమకు తామే సాటి అన్న రీతిలో వ్యవహరించే దుండగుల ఇష్టారాజ్యంగా మారింది. సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించే అమెరికాలో 13వ తేది సాయంత్రం 6.15 నిమిషాలకు ఏకంగా మాజీ అధ్యక్షుడిపైనే కాల్పులు జరిపాడు ఓ దుండగుడు. అమెరికా ఎన్నికల్లో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్ లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో అగంతకుడు కాల్పులు జరిపాడు. ఎత్తైన ప్రదేశం నుండి కాల్పులు జరపడంతో ట్రంప్ చెవికి గాయం కాగా… ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలయ్యాయి. కాల్పులను గమనించిన సీక్రెట్ సర్వీసెస్ బృందం అంగతుకునిపై ఎదురుదాడికి దిగడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ట్రంప్ ప్రచారం నిర్వహించిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.