సుప్రీం కోర్టు నిర్ణయం
దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడి కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. మహిళను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడిని ఆదేశించిన సుప్రీం, ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గిలు వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో జరిగిన ఈ విచారణకు హాజరైన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్ రావు కూడా హాజరు కావడం గమనార్హం.