శామీర్ పేటలో ట్రాప్… కరీంనగర్ లో హాట్ టాపిక్…

రూ. 10 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో అవినీతి విభాగాల జాబితాలో రెవెన్యూ టాప్ టాప్ లిస్టులో ఉందని ఏసీబీ డీజీపీ సివి ఆనంద్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే అదే విభాగానికి చెందిన అవినీతి తిమింగళం పట్టుబడింది. రూ. డ్రైవర్ ద్వారా రూ. 10 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా శామీర్ పెట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ ఆయన డ్రైవర్ బద్రిని మంగళవారం పట్టుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తహసీల్దార్ సత్యనారాయణ ప్రస్తుతం కరీంనగర్ లో నివాసం ఉంటున్నారు. కరీంనగర్ లో కూడా సోదాలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. మొవ్వా రామశేషగిరి రావుకు చెందిన భూములకు సంబంధించిన రిపోర్టు అనుకూలంగా రాయడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలంటే రూ. 20 లక్షలు డిమాండ్ చేయగా ఫస్ట్ ఫేజ్ లో రూ. 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అడ్వాన్స్ గా చెక్కు…

ఆర్వోఆర్ పాసు బుక్కుల ఇప్పించాలంటే అడ్వాన్స్ గా చెక్కు ఇవ్వాలన్న ఒప్పందం కూడా జరిగినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. గత సంవత్సరం డిసెంబర్ 28న రూ. 20 లక్షల చెక్కును ష్యురిటీగా తహసీల్దార్ సత్యానారాయణకు ఇచ్చినట్టుగా బాధితుడు ఏసీబీ అధికారులకు వివరించారు. దీంతో ఆ చెక్కును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page