మన రాజ్యంగంలో మహిళల రక్షణ కొరకు చాలా చట్టాలు ఉన్నాయి. కొత్తగా కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ మహిళలపై జరిగే దారుణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు.. అది గుడి, బడి, రోడ్డు లేక ఇళ్లు అని కూడా చూడకుండా కొంతమంది మృగాళ్ల విరుచుకుపడి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. లేదంటే హత్యలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒంటరిగా రోడ్డుపై వెళుతున్న ఓ యువతిపై కొంత మంది దుండగులు దారుణానికి పాల్పడగా.. అదంతా సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో ఓ ప్రాంతానికి చెందిన దీపక్, జ్యోతి భార్యాభర్తలు. జ్యోతి స్థానికంగా ఉండే ఫ్లిప్ కార్ట్‌లో కొరియార్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంది. భర్త దీపక్ కూడా ఉద్యోగం చేసుకుంటున్నాడు. జ్యోతి డైలీ ఆఫీస్‌కు వెళ్తూ వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతుంది. జ్యోతి ఒంటరిగా స్కూటీపై వెళుతున్న క్రమంలో ఆమెను ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చారు. ఈ దాడిలో జ్యోతి అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దారుణం మొత్తం పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అయితే దుండగులు అసలు ఆ యువతిని ఎందుకు కాల్చి చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.