బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో సారి ఈడీ విచారణ ఎదుర్కొని విజయ దరహాసంతో బయటకు వచ్చారు. మంగళవారం రాత్రి దాదాపు 10 గంటల పాటు కవిత ను విచారించిన ఈడీ అధికారులు పంపించారు. ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చిన ఆమె విజయదరహాసంతో విక్టరీ సింబల్ చూపుతూ తుగ్లక్ రోడ్డుకు వెల్లిపోయారు. అయితే మంగళవారం నాడు కవిత ఈడీ అధికారులకు అప్పగించిన మొబైల్ ఫోన్ల వివరాలు సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. వాటిని ఎనలైజ్ చేసిన తరువాత కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చే అవకాశాలో ఉన్నాయి. మరో వైపును ఈ నెల 24న ఈడీ విచారఫై ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణ ఉన్న నేపథ్యంలో ఆమెను మళ్లీ ఎప్పుడు పిలుస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేద. సాయంత్రం కవిత అడ్వకేట్ సోమ భరత్ ను ప్రత్యేకంగా ఈడీ కార్యాలయంలోకి పిలిపించిన ఈడీ అధికారులు కొన్ని డాక్యూ మెంట్స్ అడిగి తీసుకున్నారు. అయితే ఈ రోజు మాత్రం కవితను అరెస్ట్ చేసేది లేదని, మరోసారి మాత్రం విచారణకు పిలుస్తామని సోమా భరత్ తో ఈడీ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో మళ్లీ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుండి పిలుపు ఖాయంగా ఉన్నట్టు స్పఫ్టం అవుతోంది. అయితే మంగళవారం కవితను ఏఏ అంశాలనూ ఈడీ ప్రశ్నించిందన్న విషయంపై మాత్రం తెలియరావడం లేదు. ఊహాగానాలే ఈ వ్యవహారంలో ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చాయి. కానీ ఆమెను ఈడీ ఏఏ విషయాలపై ఆరా తీసింది అన్న వివరాలు మాత్రం బయటకు రావడం లేదు.