సీపీ క్యాంప్ ఆఫీస్ కంపౌండ్ వాల్ ను ఢీ కొట్టిన టవేరా…


పోలీసుల హై అలెర్ట్…

దిశ దశ, కరీంనగర్:

అంతా ప్రశాంతంగా అక్కడి వాతావరణం నెలకొంది… ఆ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు అప్పుడప్పుడు సాగుతున్నాయి. కరీంనగర్ పోలీసు కమిషనరేట్ క్యాంప్ ఆఫీసు కంపౌండ్ వాల్ ను ఓ వాహనం ఢీ కొట్టి సమీపంలో ఉన్న వాహనాల మీదుగా దూసుకెళ్లింది. అప్పటి వరకు శాంతంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహా కారాలు మొదలయ్యాయి. ఏమైందో అర్థం కాక ఆ ప్రాంతం మీదుగా వెల్లే వాహానాలన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అసలే పోలీసు కమిషనర్ కార్యాలయం కావడంతో సామాన్యులంతా అయోమయంలో గమనిస్తున్నారు. సీపీ క్యాంప్ కార్యాలయంలో ఉన్న పోలీసులు విజిల్స్ వేస్తూ ఏం జరిగిందోనని ఆరా తీస్తున్నారు. అంతలోనే ఓ వివాహనికి వెల్తోస్తున్న టవేరా అదుపు తప్పి సీపీ ఆఫీసు కంపౌండ్ వాల్ ను డీకొట్టిందన్న విషయం తెలుసుకుని అంతా ఊపిరి తీసుకున్నారు. అసలే నక్సల్స్ కార్యకలాపాలు చాపకింద నీరులా మొదలయ్యాయన్న ప్రచారం నేపథ్యంలో ఏకంగా కరీంనగర్ సీపీ కార్యాలయం కంపౌండ్ వాల్ ను ఢీ కొట్టడంతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఈ టవేరా కాస్తా సీపీ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఇతర వాహనాలను కూడా ఢీ కొట్టడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరూ పరేషాన్ అయినప్పటికీ సాధారణ విషయమేనని తెలియడంతో పోలీసులు శాంతించారు. టవేరా డ్రైవర్ చేసిన తప్పిదం కాస్తా కరీంనగర్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ను అలెర్ట్ చేసినట్టయింది. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులతో అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి తన బిడ్డలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. చివరకు తామంతా క్షేమంగా ఉన్నామన్న సంతోషంతో ఆ తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. సాధారణంగా సీపీ కార్యాలయం ముందు నుండి వెల్లే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. కానీ శుక్రవారం అర్థరాత్రి మాత్రం టవేరా వాహనం చేసిన హంగామాతో ప్రైవేటు వెహికిల్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఏర్పడింది.

You cannot copy content of this page