ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆవేదన
మెడలో ప్లకార్డు వేసుకున్న వైనం
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల ప్రజా వాణి కార్యాక్రమానికి వచ్చిన ఓ వృద్దుడు అధికార యంత్రాంగానికి షాకిచ్చాడు. తనకు జరిగిన అన్యాయం గురించి ఇప్పటికే ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ నిరసన వ్యక్తం చేశాడు. కలెక్టరేట్ కార్యాలయం ముందు కొద్దిసేపు తన ఆవేదనను వెల్లగక్కాడు. జిల్లాలోని పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన సిహెచ్ మల్లయ్య కథనం ప్రకారం… 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకుని భూమి హక్కులు అనుభవిస్తున్న తనను గ్రామ సర్పంచ్ తో సహా మరో నలుగురు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. సర్వే నెంబర్ 397, 398లో 19 గుంటల భూమి కొనుగోలు చేసుకుని 12 ఫీట్ల వెడల్పుతో 75 ఫీట్ల పొడవుగల రోడ్డు కూడా ఉందని, ఈ రోడ్డును గత మార్చి 6న సర్పంచ్ తో పాటు మరో నలుగురు కలిసి వచ్చి జేసీబీతో మట్టి వేసి రాకపోకలు లేకుండా చేశారని ఆరోపించారు. అడ్డు వెల్లిన తనును చంపుతానని కూడా బెదిరంచారని తాను వృద్దాప్యంలో ఉండడం, కొడుకులు ఉపాధి కోసం బయటకు వెల్లిన విషయాన్ని గమనించి రోడ్డును మూసేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం గురించి తాను ఓ సారి జిల్లా ఎస్పీకి, రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని, తనకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని కోరినా పట్టించుకునేవారే లేకుండా పోయారని ఆరోపించాడు. ఎస్సీ కార్యాలయానికి వెల్లి పలుమార్లు కలవగా మల్యాల సీఐని కూడా కలిశానని, అయితే రెండు నెలలుగా మల్యాల సీఐ ఆపీసు చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం మరోసారి ప్రజావాణి కార్యాలయానికి వచ్చిన ఆయన తన మెడలో అధికారుల నిర్లక్ష్యం నశించాలి అని రాసి ఉన్న ప్లకార్డు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. మల్లయ్య పిటిషన్ తీసుకున్న జిల్లా అధికారులు మరోసారి మల్యాల సీఐకి సిఫార్సు చేశారు.
Disha Dasha
1884 posts
Next Post