454 మంది ఎస్ ఇద్దరు నో
ఓటింగ్ ప్రక్రియ ఎలా జరిగిందంటే..?
దిశ దశ, న్యూ ఢిల్లీ:
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోకసభలో ఆమోద ముద్ర పడింది. రేపు ఈ బిల్లును రాజ్య సభ ముందు ఉంచనుంది కేంద్రం. 454 మంది సభ్యులు లోకసభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందంటూ విపక్షాలు లోకసభ నుండి వాకౌట్ చేశాయి. అనంతరం సభలో బిల్లుపై జరిగిన సుదీర్ఘ చర్చలో అన్ని పక్షాలు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ తరువాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రకియను నిర్వహించారు. డిజిటల్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో సభ్యులకు ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. ఈ స్లిప్పులపై ఎన్, నో అని ఉంటాయని సభ్యులు తమకు అభిప్రాయాన్ని వెల్లడించేందుకు తమకు నచ్చిన స్లిప్పులో సంతకం చేసి వారి పేరు, ఐడీ నంబర్, నియోజకవర్గం, రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతం వివరాలను, తేది వేయాలని లోకసభ కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ సూచించారు. స్పిప్పుల పంపిణీ ప్రక్రియ నుండి తిరిగి లోకసభ ప్రతినిధులు తీసుకునే వరకు సభ్యులు తమ తమ స్థానాలు వదిలి వెల్లవద్దని కూడా కోరారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తరువాత బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ ప్రకటించారు.