ప్రపంచంలోనే టాపర్
ఆయన నెల ఆదాయం రూ. 7 కోట్లు
ముంబాయిలో ఐటీ రైడ్స్ తో వెలుగులోకి…
దిశ దశ, న్యూఢిల్లీ:
ఆయన చదవింది పదో తరగతో… ఇంటర్మీడియెటో కాదు… అతనికి అంగవైకల్యమూ లేదు… కానీ అతను ఎంచుకున్న దారి మాత్రం అత్యంత విచిత్రంగా ఉందనే చెప్పాలి. ఉన్నతాధికారుల నుండి సామాన్యుల వరకు ఆలోచింప చేస్తున్న ఈ ప్రబుద్దుడు డబ్బు సంపాదించుకునేందుకు ఎంచుకున్న మార్గమే విచిత్రంగా ఉంది. చదువులో టాపర్ అయిన అతను డబ్బు సంపాదనలో కూడా డిఫరెంట్ వింగ్ ను ఎంచుకున్నాడు. ఇటీవల ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చిన ఇతని గురించి తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.
భారత్ జైన్ స్పెషాలిటీ…
ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన భిక్షగాడు ఇతనే కావచ్చు. కోల్ కత్తలో ఐఐఎం ర్యాంకర్ అయిన ఈయన తన మేథస్సుకు పని చెప్పి అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించే ప్రయత్నం చేయలేదు. మల్టినేషనల్ కంపెనీలో ఉపాధి పొంది తన క్రియేటివిటీకి పదును పెట్టి బ్రాండ్ క్రియేట్ చేసుకోలేదు. కేవలం మన దేశంలో అత్యంత సహజంగా కనిపించే వృత్తినే తన ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. ఓ చిన్న ఐడియాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భారత్ జైన్ ను ఇటీవల ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడి చేసి పట్టుకోవడంతో ప్రపంచమే ఆశ్యర్యంలో మునిగిపోయంది. ఐటీ ఆఫీసర్లకే షాక్ ఇచ్చే స్థాయిలో ఇతని ఆదాయం ఉందంటే ఇతని సంపాదన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల 22 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నంలో ఐటీ అధికారుల కంట పడడంతో భారత జైన్ గుట్టు రట్టయిది. 18 వేల మంది ఎంప్లాయిస్ ను కూడా పెట్టుకున్న భారత్ జైన్ వారిచే భిక్షాటన చేయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కోల్ కత్తా ఐఐఎం ర్యాంకర్ భారత్ జైన్ ప్రతినెలా గడించే ఆదాయం జస్ట్ రూ.7 కోట్లు కాగా… అదీ ట్యాక్స్ ఫ్రీ డబ్బే కావడం గమనార్హం. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఆజాద్ మైదాన్ ప్రాంతాల్లో ఎంప్లాయిస్ గా పెట్టుకున్న బెగ్గర్ల ద్వారా సంపాదిస్తున్నాడు.
ఆస్థులు ఇవే…
తన కింద ఉన్న 18 వేల మంది బిక్షగాళ్లకు రోజుకు మూడు సార్లు భోజనం ఏర్పాట్లు చేసే జైన్ ఇందుకోసం 20 శాతం వసూలు చేస్తాడని అధికారుల విచారణలో తేలింది. ముంబాయి నగరంలోని ధారావిలో మంచి ఇల్లు కూడా కొనుగోలు చేసిన ఈయనకు ముంబైలో ఎనిమిది విల్లాలు, 18 అత్యాధునిక సదూపాయాలు ఉన్న 18 అపార్ట్ మెంట్స్, రెండు ప్రైవేట్ ఇండిపెండెంట్ బంగ్లాలు, ఒక హెటల్ కూడా ఉండగా తాజాగా రూ. 22 కోట్లతో ఇల్లు కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇతనికి నలుగురు భార్యలతో దర్జాగా జీవనం సాగిస్తున్నాడీ రిచెస్ట్ బెగ్గర్. ఐటీ అధికారులు భారత్ జైన్ కు సంబంధించిన నివాసాలపై దాడులు చేయగా రూ. 460 కోట్ల నగదు లభ్యం అయింది.
ఇంటర్నేషనల్…
అయితే కేవలం ముంబాయి మహా నగరానికే ఇతని సామ్రాజ్యాన్ని విస్తరించుకోలేదని కూడా అధికారుల విచారణలో తేలింది. మలేషియా, ఇండోనేషియాల్లో కూడా భిక్షాటన వ్యాపారాన్ని ప్రారంభించినట్టుగా కూడా గుర్తించడంతో విస్తూ పోవడం అధికారుల వంతయింది. ఇంటర్నేషనల్ సిండికేట్ మాఫియాను నిర్మించడం కూడా ఆరంభించిన ఈయన గురించి విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. భారత్ జైన్ గురించి వైరల్ కావడంతో నెటిజన్లు విచిత్రంగా కామెంట్లు చేస్తున్నారు. ఐఐఎం చదివి మేనేజె మెంట్ స్కిల్స్ బాగా ఒంటబట్టించుకున్నాడని కొందరు, బిటినెస్ టాక్ టీస్ అంటూ మరికొందరు ఛలోక్తులు విసురుతున్నారు.