‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య. తర్వాత పలు సినిమాలు తీసి యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక తాజాగా పెళ్లి కూడా చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు. అటు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. ఇటు ప్రోఫిషయల్ లైఫ్‌లో కూడా రానిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన హీరో.. తాజాగా ఓ యువకుడిపై సీరియస్ అయ్యి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ఓ యువకుడు అమ్మాయిపై చేయిచేసుకున్నడని తెలుస్తోంది. అది చూసిన మన యంగ్ హీరో కారులోనుంచి దిగి మరీ ఆ యువకుడిపై సీరియస్ అయ్యాడు. నడి రోడ్డుపై అమ్మాయిని కొడతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆమెకు సారీ చెప్తావా చెప్పావా అంటూ అబ్బాయిని పట్టుకుని నిలదీశాడు. హైదారాబాద్ సిగ్నల్ దగ్గర ఈ గొడవ జరగడంతో అక్కడ కాస్త ట్రాపిక్కు అంతరాయం ఏర్పడింది. కానీ ఆ యువకుడు మాత్రం యువతికి సారీ చెప్పలేదు. దీంతో నాగశౌర్యతో పాటు అక్కడ ఉన్న మరి కొందరు కూడా సారీ చెప్పమని గొడవకు దిగారు. దానికి ఆ యువకుడు నేనెందుకు సారీ చెప్తా బ్రో ఆమె నా లవర్ అంటూ బదులిచ్చాడు. దీంతో హీరో నీ లవర్ అయితే నడిరోడ్డుపై చేయిచేసుకుంటావా అంటూ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో సమీపంలో ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతుంది.
అయితే ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ నాగ శౌర్యకు మద్దతుగా మాట్లాడుకుంటున్నారు. అన్యాయాలు జరిగినప్పుడు సినిమాల్లో రియాక్ట్ కావడం కాదు.. ఇలా రియల్‌గా రియాక్ట్ అయిన వారినే నిజమైన హీరో అంటారు అంటూ ప్రశంసిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇదాంత ఓ ప్రాంక్ అయుంటుంది. ఈ రోజుల్లో హీరోలు కూడా ప్రాంక్‌లు చేయడం కామన్ అయిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇదంతా నిజమా ప్రాంక్ అనేది తెలియదు కానీ.. నాగశౌర్య హీరోగా.. శ్రీనివాస అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా మార్చి 17న రిలీజ్ సిద్ధంగా ఉంది. కాగా.. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
https://www.instagram.com/reel/CpMtCaTJyxg/?igshid=MDJmNzVkMjY=