యువతి హంగామా…

ఆటోడ్రైవర్ పరేషాన్…

ఓ యువతి చేసిన ఘనకార్యానికి ఆటోవాల పరేషాన్ లో పడ్డాడు. అద్దె డబ్బులు వస్తాయని ఆశించి అల్లంత దూరం అయినా సరే అన్న పాపానికి చుక్కలు చూపించిందో యువతి. ఓ వైపున తిడుతూ.. మరో వైపున కొడుతూ రామగుండంలో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అయితే అమ్మాయి కావడంతో చేసేదేం లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఆటో డ్రైవర్ తిరుపతి కరీంనగర్ లోని రాంనగర్ ఆటోస్టాండ్ లో ఉంటున్నాడు. ఇక్కడి నుండి లోకల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి తిరుపతి ఆటో వద్దకు వచ్చిన ఓ యువతి తనకు ఆటో అద్దెకు కావాలని గోదావరిఖనిలో దించాలని కోరింది. దీంతో రూ. 1500 ఇవ్వాలని తిరుపతి అడిగాడు. తాను గతంలో రూ. 1000కే వెల్లానని చెప్పింది. చివరకు ఇద్దరి మధ్య బేరం కుదిరిన తరువాత తిరుపతి సదరు యువతిని గోదావరిఖనికి బయలుదేరారు. గోదావరిఖని చౌరస్తాలో దిగిన తరువాత యువతిని ఆటో అద్దె డబ్బులు ఇవ్వాలని కోరడంతో ఆమె ఎదురుదాడికి దిగి బూతుపురాణం అందుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారి వద్దకు చేరుకుని ఆరా తీస్తున్నప్పుడు కూడా యువతి తిరుపతిపై రాళ్లతో చేతులతో కొట్టడం ఆరంభించింది. మార్గమధ్యలో డిజిల్ కు డబ్బులు ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా తననే రూ. 200 ఖర్చులకు తీసుకుందని ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇష్టం వచ్చినట్టు తిడుతూ వేరే ఆటోలో ఎక్కి అతన్ని కూడా ఇబ్బంది పెట్టిందన్నారు. గోదావరిఖని పోలీసులు సదరు యువతి బ్యాగు తనిఖీ చేయగా ఓ మద్యం బాటిల్ లభ్యం కావడం గమనార్హం. ఆటోవాలనే యువతి పరేషాన్ చేసిన తీరు పారిశ్రామిక ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page