అంతటా అలా… కరీంనగర్ మాత్రం మరోలా..?

అంతు చిక్కని పౌర సంబంధాల శాఖ తీరు…

దిశ దశ, కరీంనగర్:

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జర్నలిస్టులకు ప్రత్యేకంగా గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులను ఆహ్వానించినప్పటికీ కరీంనగర్ జిల్లాలో మాత్రం ప్రత్యేకతను చాటుకున్నారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులందరిని ఆహ్వానిస్తే కరీంనగర్ లో మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించడం సరికొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని DPROలు అధికారికంగా షేర్ చేసే వాట్సప్ గ్రూపుల్లో జర్నలిస్టులకు డిన్నర్ ఏర్పాటు చేశామని అందరూ రావాలని కోరుతూ ఆహ్వానం పలికారు. అయితే కొన్ని జిల్లాల్లో అక్రిడేటే్ జర్నలిస్టులే రావాలని కోరడంతో అందరిని పిలిస్తే బావుంటుందన్న ప్రతిపాదన చేశారు ఆయా జిల్లాల జర్నలిస్టులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అక్రిడేట్ జర్నలిస్టులను డిన్నర్ కు రావాలని ఆహ్వానించగా అక్కడి జర్నలిస్టు ఒకరు అందరికీ అక్రిడేషన్లు లేవని, భోజనానికి పిలిచే విషయంలో అక్రిడేషన్ కార్డు నిబంధనను తొలగించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. దీంతో అక్కడి జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఆహ్వానించారు. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం DPRO యంత్రాంగం తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కేవలం కొంతమంది జర్నలిస్టులకు పర్సనల్ గా మెసెజ్ చేసి, ఫోన్లు చేసి దావత్ కు రావాలని ఆహ్వానించారు. DPRO అధికారికంగా నిర్వహిస్తున్న వాట్సప్ గ్రూపులో మాత్రం డిన్నర్ ఏర్పాటు చేశామని రావాలని కోరుతూ ఎలాంటి మెసెజ్ షేర్ చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికి ఇస్తామని సీఎం, మంత్రులు, జిల్లా కలెక్టర్లు పదే పదే చేస్తున్న ప్రకటనలను మీడియాకు షేర్ చేసే DPRO యంత్రాంగం డిన్నర్ ఏర్పాటు చేసిన విషయంలో మాత్రం జర్నలిస్టులందరిని గుర్తించకపోవడం బాధాకరం. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఈ బోజనాలకు జర్నలిస్టులందరిని సమానంగా చూడడంలోనే వివక్ష చూపిస్తే ఎలా అన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ ఖాతా నుండి డ్రా చేసి ఖర్చు చేసే డబ్బుల విషయంలో పొదుపు నినాదాన్ని ఎత్తుకున్నారా లేక తమ దృష్టిలో ఉన్న వారే జర్నలిస్టులు అన్న భావనలో ఉన్నారా తెలియదు కానీ కరీంనగర్ జర్నలిస్టులను వివక్ష చూపిన తీరు మాత్రం దారుణమనే చెప్పాలి. అధికారులు ఏర్పాటు చేసిన ఈ భోజనాలకు జర్నలిస్టులందరూ కట్టగట్టుకుని వస్తారని భావించి పిలవ లేదా లేక ఫలనా వారినే పిలిచి తమ అభిమానాన్ని చాటు కోవాలని భావించారా అన్న చర్చ జర్నలిస్టు వర్గాల్లో మొదలైంది. అదికారులు పిలిచే ఈ భోజనం చేయడం వల్ల తామేదో నష్ట పోయామని జర్నలిస్టు సమాజం అనుకోవడం లేదు కానీ… ఆహ్వానించే విషయంలో సమానత్వం పాటించాల్సి ఉందని అంటున్నారు చాలా మంది జర్నలిస్టులు.

You cannot copy content of this page