తునాతునకలైన ఫోన్లు ఇవే…

జోగింద్రా జీ జర దేఖో…

ఎమ్మెల్సీ కవిత సంచలన స్టెప్

ఢిల్లీ లిక్క్ర్ స్కాంలో విచారణ చేపట్టిన ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటికి రెండు సార్లు విచారణకు హాజరైన కవిత మూడో రోజు ముచ్చటైన ఝలక్ ఇచ్చారు. దీంతో లిక్కర్ స్కాం వ్యవహారంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చినట్టయింది. మంగళవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్ సీఎం కేసీఆర్ నివాసం నుండి ఈడీ కార్యాలయానికి వెల్లేప్పుడు కవిత ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. మొదట మీడియాతో మాట్లాడుతారని బీఆర్ఎస్ వర్గాలు లీక్ చేసినప్పటికీ ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెల్లారు. అయితే కవిత మాత్రం బాజాప్తాగా రెండు కవర్లలో మోబైల్ ఫోన్లతో ఉన్న కవర్లను ప్రదర్శించి సంచలన సృష్టించారు. ఇప్పటి వరకు ఈడీ కార్యాలయానికి వెల్లినట్టుగానే ఈ రోజు కూడా బయలుదేరుతారని భావించినప్పటికీ అనూహ్యంగా మొబైల్ ఫోన్లను కూడా తన వెంట తీసుకెళ్లడం కలకలం సృష్టించింది.

ఈడీ ఆఫీసర్ కు లేఖ…

మరో వైపున ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత లేఖ రాసి మరో సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఈ లేఖలో ఈడీ తప్పిదాలను ఎత్తి చూపుతూ దుయ్యబట్టారు. ఓ మహిళకు సంబందించిన ఫోనును స్వాధీనం చేసుకోవడం వల్ల ఆమె గోప్యతకు భంగం కలగదా అంటూ ఆ లేఖను ఈడీ అదికారిని ప్రశ్నించారు. దుర్బుద్దితో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తూ నేను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని, కనీసం ఈ విషయంలో నాకు సమన్లు జారీ చేయకుండా, ప్రశ్నించకుండానే దర్యాప్తు సంస్థ ఏ పరిస్థితుల్లో ఈ ఆరోపణలు చేసిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. విచారణకు రావాలని మార్చి నెలలో నాకు సమన్లు జారీ చేసిన ఈడీ అధికారులు గత సంవత్సరం నవంబర్ లో నేను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించిందంటే కావాలనే దురుద్దేశ్యపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల గురించి దురుద్దేశ్యపూర్వకంగానే లీకేజీలు ఇచ్చారని దీనివల్ల రాజకీయ ప్రత్యర్థులు ప్రజక్షేత్రంలో నన్ను నిందిస్తున్నారన్నారు. దీనివల్ల ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను చులకన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని కవిత వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page