హోండా కంపెనీ కొత్త కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. కార్ల కంపెనీలో పేరు సంపాదించుకొని ..ప్రజాదరణ పొందింది. ఇప్పుడున్న కార్లకు ధీటుగా మార్కెట్‌లోకి హోండా సిటీకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఈ కొత్త కారును విడుదల చేయబోతున్నారని తెలిసింది. హోండా కంపెనీ ఈ కారును అప్‌డేట్ చేసి కొన్ని మార్పులు చేసి మళ్లీ వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. అంతేకాకుండా ఈ కారులో చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయట. పలు వేరింయట్స్‌లో ఈ కారును విడుదల చేయనున్నారు .
ఈ కారుకు సంబంధించిన డిజైన్ , ధర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
హోండా సిటీ కారును 2020 జూలై లో మన దేశంలో విడుదల చేశారు. ఇప్పుడు రాబోయే కొత్త మోడల్‌లో కొత్త ఫ్రంట్, రియర్ డిజైన్ వస్తుంది.
అంతేకాకుండా కొత్త ఫీచర్‌ను కూడా దీనిలో చూడొచ్చు. సిటీ వేరియంట్‌లో కొత్త మార్పులు చేసి హైబ్రిడ్ సిస్టమ్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.
ఈ కార్లను కొత్త మోడల్ కారును మార్చిలో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ సమాచారం అధికారికంగా వెల్లడించలేదు. హోండా సిటీ పెట్రోల్ మోడల్ కారు రూ. 11.87 లక్షల నుండి రూ. 15.62 లక్షల వరకు ఉంది. హైబ్రిడ్ కార్ మోడల్ రూ. 19.89 లక్షలుగా ఉంది. సిటీ మోడల్ కార్లలో కొత్త రకాల ఫీచర్లు అందుబాటులోకి వచ్చాక వాటి ధరలు మనం ఉహించలేనంతగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.