ఈ రోజుల్లో కార్ కొనడం పెద్ద కష్టం కాదు. డబ్బులు ఉంటేనో లేక లోనుకు అర్హులైతే చాలు ..కార్ ఈజీగా కొనుక్కోవచ్చు. కానీ క్యాష్, కారు లోన్ కంటే ముందుగా ఎలాంటి కారు అయితే బాగుంటుంది, ఏ కారు తీసుకుంటే అన్ని రకాలుగా బావుంటుంది.. ఏ కార్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో కూడా చూసుకోవాలి…
ఇవన్నీ చూసే ముందు చాలా మంది పరిగణనలోకి తీసుకునే ఇంకో అంశం కార్ ఏ బ్రాండ్‌కి చెందినది… ఏ కారుకు ఎక్కువ క్రేజ్ ఉంది.. ఇంకా కారును ఎక్కువగా కస్టమర్లు కొనుక్కుంటున్నారు. ఆ కారునే తీసుకోవడానికి ప్రయత్నించండి. అంతమంది ఆ కారును తీసుకుంటున్నారంటే నమ్మకం ఉంటేనే కదా కారు తీసుకుంటురన్నా విషయం దృష్టిలో పెట్టుకోవాలి.
ఇండియాలోనే కార్ల కంపెనీలలో పేరున్న మారుతి సుజుకి 2023 జనవరిలో అత్యధికంగా కార్లను అమ్మిన బ్రాండ్స్ లిస్టులో మొదటి స్థానం కైవసం చేసుకుంది. గత నెలలో ఈ కార్ల కంపెనీ మొత్తం 1,47,348 కార్లు అమ్ముడుపోయాయి. 2022 జనవరిలో.. అంటే ఏడాదికి క్రితం మారుతి సుజుకి మొత్తం 1,28,924 కార్లు అమ్ముడుపోయాయి. ఏడాదిలో 14.30 శాతం సేల్స్ పెరిగాయి. మారుతి సుజుకి Alto 800, Alto 800, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, సియాజ్, ఎక్స్ఎల్-6, బ్రెజ్జా, గ్రాండ్ వితారా, ఇగ్నైస్, ఈకో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి సేల్స్ కు పెట్టింది.