ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకుల్లో ఒకటైన HDFC బ్యాంక్ కొత్త పథకాలను, క్రొత్త వడ్డీ రేట్లను మన ముందుకు తీసుకొచ్చింది. పెంచిన FD రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంక్ HDFC, FD రేట్లను డిపాజిట్ వడ్డీను 15 నెలల నుంచి 2 ఏళ్లకు వడ్డీ రేటు 7.15 శాతం పెంచారు, 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 7 శాతం పెంచారు. FD డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని బట్టి మారుతుంటుంది. 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉండే డిపాజిట్ పై కూడా వడ్డీ రేటును పెంచింది. 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉండే పౌరులకు 4.50 నుంచి 7 శాతం వరకూ వడ్డీ రేటును అందివ్వనున్నారు.15 నెలల నుంచి 2 ఏళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీరేటు 7.15 శాతం పెరిగింది. సీనియర్ సిటిజన్లకు అయితే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.75 శాతం అందివ్వనుంది.ఈ వడ్డీ రేట్లు 2023 జనవరి 27 నుంచి మారాయి.
ఇక 3 నెలల నుంచి 6 నెలల డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం గా ఉంది. అలాగే 6 నెలల నుంచి 9 నెలల డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు అందివ్వనుంది. HDFC బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లపై 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకూ ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. అదే 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు ఉండే డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటు ఉంటుంది.