ఈడీ సమన్లు కావవి…మోడీ సమన్లవి

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజం

దిశ దశ, హైదరాబాద్:

లిక్కర్ స్కాంకు సంబందించి విచారణకు రావాలని తన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇచ్చిన నోటీసులపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూ ఆయన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో అత్యవసరం సమావేశం అయ్యారు కేటీఆర్. అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, మంత్రులు హాజరైన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో గత 8 ఏళ్లుగా అయితే జుమ్లా, లేకుంటే హమ్లా అన్నట్టుగా సాగుతోందని, బీఆర్ఎస్ నేతలపై సీబీఐ, ఈడి, ఐ టి దాడులు చేస్తూ విచారణలకు ఉసిగొల్పిందని మండిపడ్డారు. అవి ఈడీ సమన్లు కావని, మోడీ సమన్లేనని వ్యాఖ్యానించిన కేటీఆర్ ఈడీ, ఐటీలు వారి చేతిలో కీలు బొమ్మలు, తోలు బొమ్మలుగా మారాయని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చేసిందేమీ లేదని, గౌతం అదాని ఎవరి బినామీ అని అడిగితే చిన్న పిల్లలు కూడా చెబుతారన్నారు. రూ. 13 లక్షల కోట్లు ఆవిరైనా ప్రధాని, ఆర్ధిక మంత్రుల్లో ఉలుకూ పలుకు లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక సంస్థ ఆరు ఎయిర్ పోర్టులు పెట్టేందుకు అనుమతి ఇవ్వడానికి నిబంధనలు మార్చింది నిజం కాదా..? గుజరాత్ లో అదాని పోర్టులో హెరాయిన్ దొరికినా కేసులు ఎందుకు నమోదు కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ లో చేరితే నేతలు పునీతులు అవుతారా..? దేశంలో ఎం జరుగుతుందో పక్క దేశాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. భారత మీడియాను లెక్క చేయనని బీబీసీ పై దాడి జరిపి స్ఫష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. అదాని కంపెనీల ప్రచారం కోసం ప్రధాని పని చేస్తున్నారని, ప్రధాని మోడీ వచ్చిన తరువాత 5,423 కేసులు పెట్టారని, 23 కేసుల్లో మాత్రమే నిరూపించగలిగారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందని, కర్నాటకలో లంచం తీసుకుంటై పట్టుబడ్డా కేసులు ఉండవని ఎద్దేవ చేశారు. 9 ఏళ్లల్లో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోడీది కదా అని అడిగారు. మన రాష్ట్రంలో ఓ వ్యక్తి కి 18 వేల కోట్ల కాంటాక్ట్ ఇచ్చింది నిజం కాదా..? విదేశీ బొగ్గుపై యూపీ ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పలేదా..? అదాని దందాతో బీజేపీకి చందాలు అందుతున్నాయని ధ్వజమెత్తారు.
హేమంత బిశ్వ శర్మపై నమోదైన కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

You cannot copy content of this page