ఏఐసీసీ నిర్ణయం
దిశ దశ, హైదరాబాద్:
రాజ్యసభ సభ్యులుగా ఎవరెవరికి అవకాశం ఇవ్వాలో నిర్ణయించే పనిలో జాతీయ పార్టీలు నిమగ్నం అయ్యాయి. ఖమ్మం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రేణుకా చౌదరికి తెలంగాణ నుండి ఏఐసీసీ అవకాశం కల్పించింది. ఆమెతో పాటు ఎం అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేస్తు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం లోకసభ స్థానం నుండి పోటీ చేయాలనుకున్న రేణుకా చౌదరికి అనూహ్యంగా అధిష్టానం రాజ్యసభకు అవకాశం కల్పించింది. దీంతో ఖమ్మం లోకసభ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్న కీలక నేతను పోటీ నుండి తప్పించినట్టయింది.
