దిశ దశ, దండకరాణ్యం:
తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో శనివారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం వల్లే జరిగిందని ఆరోపించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామారాజు డివిజన్ కమిటీ (బీకేఏఎస్సార్) బాధ్యుడు ఆజాద్ పేరిట ఓ లేఖ విడుదల అయింది. మావోయిస్టు పార్టీని అణిచివేయడంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకేరకమైన ధోరణిని అవలంభిస్తున్నాయని ఆరోపించారు. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే జరిగిందని ఇందుకు ములుగు ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆజాద్ పేర్కొన్నారు. తెలంగాణ గ్రే హౌండ్స్, స్పెషల్ పార్టీ, కోబ్రా పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నక్సల్స్ భీకర పోరాటం చేశారన్నారు. ఇటీవల మహారాష్ట్ర సరిహధ్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ముగ్గురిని మట్టుబెట్టారని వారికి విష ప్రయోగం చేసి చంపారి అజాద్ ఆరోపించారు. బడా కంపెనీలకు, సామ్రాజ్యవాద సంస్థలకు తొత్తులుగా మారి గుండుగుత్తగా తాకట్టు పెట్టే క్రమంలో ఆదివాసీల ఉద్యమాలను అణగదొక్కుతున్నారన్నారు.
ఎన్ కౌంటర్ మృతులు వీరే…
ములుగు, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో తెలంగాణ ఎస్ జడ్సీసీ సభ్యుడు సాగర్, ఏసీఎం మణిరాంతో పాటు మరోకరు మరణించారన్నారు. ఈ ఘటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆజాద్ అన్నారు.
dishadasha
1232 posts