ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే మోడల్ పోలీంగ్ స్టేషన్

దిశ దశ, జాతీయం:

గ్రీన్ మ్యాట్ పరిచి… సైడ్ వాల్స్ ఏర్పాటు చేసి… ప్రత్యేకంగా టెంట్లు వేసి… బెలూన్లను ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లనే ఇప్పటి వరకు చూసి ఉంటారు. ఇలా తయారు చేసిన వాటినే మోడల్ పోలింగ్ స్టేషన్లుగా విని ఉంటారు. కానీ సహజత్వాన్ని, అక్కడి ప్రజల సంస్కృతికి దర్పణం పట్టే విధంగా తీర్చి దిద్దిన పోలీంట్ స్టేషన్ ను దేశంలో ఎక్కడా చూసి ఉండారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ స్టేషన్ ను గమనిస్తే అందరూ ఔరా అనాల్సిందే. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్ చాలామందిని ఆకట్టుకుంది.

నేచురల్…

జిల్లాలోని భామ్రేఘాడ్ తాలుకా హేమాలక్సాలోని లోక్ బిరదారి ప్రాజెక్ట్ హస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్ సరి కొత్తదనాన్ని సంతరించుకుంది. అటవీ ప్రాంతంలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సంకల్సించిన జిల్లా ఎన్నికల అధికారులు తమ ఆలోచనలను సహజత్వం వైపు పెట్టారు. ఆ ప్రాంతంలో లభ్యం అయ్యే వాటిని మాత్రమే సేకరించి స్థానికుల భాగస్వామ్యతో విభిన్నంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. తొలి విడుత జరిగిన పోలింగ్ లో భాగంగా తయారు చేసిన ఈ పోలింగ్ కేంద్రాన్ని తయారు చేసిన తీరు ఆదర్శనీయంగా ఉంది. ప్రధానంగా హెమలక్సా గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. రామన్ మెమాసెసే అవార్డు గ్రహిత, భారత రత్న డాక్టర్ బాబా ఆమ్టే ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఈ ప్రాంత ఆదివాసీలకు వైద్య సైవలందిస్తంటారు. దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ప్రపంచంలోనే పేరొందింది. అయితే ఇదే ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తీర్చి దిద్దేందుకు సహజసిద్దమైన వనరులు ఉపయోగించారు.

సెల్ఫీ పాయింట్…

ఈ సెంటర్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. స్థానిక ఆధివాసీలు సేకరించిన సహజ సిద్దమైన కర్రలు, మట్టి, పేడతో షెడ్ వేయించి పై భాగంలో ఉపయోగించిన గడ్డిని స్థానికంగా ప్రవహించే నది తీరం నుండి సేకరించారు. ప్రత్యేకంగా వేసిన ఈ షెడ్ లో ఓటు హక్కు ఉపయోగించుకున్న వారు ఫోటో దిగేందుకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిలబడ్డ వారికి చల్లని వాతావరణం ఉండేందుకు తాటి ఆకులు, కొబరి నారతో తయారు చేసిన పందిరి వేయించారు. అలాగే ఈ కేంద్రం ఆవరణంలో పచ్చదనం ఉట్టిపడేలా ప్రత్యేకంగా స్థానికంగా లభ్యమయ్యే ఆకులను సేకరించి మంటపం ఏర్పాటు చేశారు. బూత్ లోపలన స్థానిక ఆదివాసీల సాంప్రదాయంగా ఉపయోగించే చెక్క బొమ్మలను మొక్కలను ఏర్పాటు చేయించారు.

డిఫరెంట్ లుక్కింగ్…

మోడల్ పోలింగ్ స్టేషన్ అనగానే మార్కెట్లో లభ్యం అయ్యే ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా భామ్రాఘాడ్ తాలుకా ఎన్నికల అధికారులు వ్యూహాత్మంగా ఆలోచించారు. ఆటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బూత్ లో స్థానికులను ఆకట్టుకునే విధంగా… సహజ సిద్దంగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించి తీర్చిదిద్దారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా అయిన ఈ ప్రాంతంలో వైవిద్యంగా ఆలోచించి స్థానిక ఆదివాసీలను భాగస్వామ్యంతో పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. అయితే ఇతర ప్రాంతాల్లో తయారు చేసినట్టు కాకుండా డిఫరెంట్ లుక్కింగ్ కొట్టొచ్చే విధంగా ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గురించి ఉన్నాతాధికారులు కూడా తెలుసుకున్నట్టుగా సమాచారం.

వెరైటీ పోలింగ్ బూత్ వీడియో గురించి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

You cannot copy content of this page