దిశ దశ, కరీంనగర్:,
మానకొండూరు మండలం పచ్చనూరుకు చెందిన రౌడీషీటర్ ప్రశాంత్ రెడ్డి హత్య వెనక అసలేం జరిగింది..? హంతకులు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగారు..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత కక్ష్యలు… వివాహేతర బంధాలు… భూతంగాలు.. కలగలిపి జరిగిన ప్రతీకారం ఫలితమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హంతకులు వ్యూహాత్మకంగానే ఈ మర్డర్ స్కెచ్ వేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. హత్యకు ముందే ప్రశాంత్ రెడ్డిని లేపేయాలని ఆలోచనతో ఉన్న నిందితులు… అతన్ని కావాలనే గర్రెపల్లికి తీసుకెళ్లి చంపి అక్కడి చెరువులో పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మానకొండూరు మండలం పచ్చనూరుకం చెందిన ప్రశాంత్ రెడ్డిని ఈ ప్రాంతంలో హత్య చేసినట్లయితే ఇక్కడి పోలీసులు వెంటాడుతారని ముందుగానే చర్చించుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కఠినంగా వ్యవహరిస్తుండడంతో… తాము సేఫ్ జోన్ లో ఉండాలంటే జ్యురిడిక్షన్ మారిస్తే అన్ని విధాల లాభం జరుగుతుందని అంచనా వేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నిందితులు వేసుకున్న ప్లాన్ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా మారిపోయింది. మర్డర్ కోసం వేసిన స్కెచ్ బెడిసికొట్టి… ఈ కేసును కరీంనగర్ పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేస్తుండడం అశనిపాతంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం నిందితులు ప్రశాంత్ రెడ్డిని కరీంనగర్ కమిషనరేట్ పరిధి నుండే కిడ్నాప్ చేయడంతో ఇక్కడ నేరం జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదయింది. దీంతో ఈ మర్డర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మానకొండూరు సర్కిల్ పోలీసులు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో క్రైం తగ్గించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసుకున్నప్పటికీ…. ప్రిలీమినరీ అఫెన్స్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జరగడంతో ఇక్కడి పోలీసుల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కరీంనగర్ లో అయితే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిన తర్వాత కరీంనగర్ సీపీ కఠినమైన చట్టాలను ఉపయోగిస్తారని భావించి ఈ హత్యను రామగుండం కమిషనరేట్ పరిధిలో చేయాలని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో వైపున ఈ నేరానికి మృతదేహం లభ్యమైన సమీప గ్రామానికి చెందిన వారి ప్రమేయం ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
లొకేషన్ ఎలా ట్రేస్ అయింది?
అయితే ప్రశాంత్ రెడ్డి నిందితులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నా… పర్ ఫెక్ట్ లోకేషన్ ఎలా ట్రేస్ అయిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రశాంత్ రెడ్డి మూవ్ మెంట్ తెలుసుకునేందుకు కేవలం మనుషులనే ఉపయోగించుకున్నారా…? లేక సాంకేతిక సహకారంతో లోకేషన్ ట్రేస్ చేశారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. కిడ్నాప్ నకు ముందు అతని కోసం తీవ్రంగా గాలించినా ఆచూకి దొరకని వ్యక్తి ఊటూరు శివార్లలో ఉన్నట్టుగా క్లియర్ కట్ సమాచారం ఎలా చేరిందన్నదే పజిల్ గా మారింది.
భూ దందాయేనా?
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న పగకు అసలు కారణం ఒక్క భూ దందా మాత్రమే కాదని ప్రచారం జరుగుతోంది. వివాహేతర సంబంధం అసలు కారణమని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబధం వల్ల గత కొంతకాలంగా విబేధాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనిని మనసులో పెట్టుకున్న వీరిద్దరూ భూ దందలో వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డ వీరిద్దరు పాత పగను మనసులో పెట్టుకునే హత్య చేసుకునే వరకు చేరుకున్నారని వినిపిస్తోంది. అయితే నిందితులు పోలీసులకు చిక్కితే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి