బీజేపీ నేతలు అంటున్నవే సీబీఐ అడుగుతోంది…

దిశ దిశ, న్యూ ఢిల్లీ:

మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కవిత బీజీపీని టార్గెట్ చేసి మాట్లాడారు. సీబీఐ అధికారులు అడగుతున్న ప్రశ్నలన్ని కూడా పాతవేనని అన్నారు. రెండేళ్ల నుండి అడిగిందే అడుగుతున్నారంటూ కవిత ఆరోపించారు. మరో వైపున బీజేపీ నేతల చెప్పు చేతల్లోనే సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్న రీతిలో ఆమె విమర్శలు చేశారు. బటయ బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారన్నారు. ఇది సీబీఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అంటూ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను ఈ నెల 23వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను తిహాడ్ జైలుకు సీబీఐ అధికారులు తరలిస్తున్నారు.

You cannot copy content of this page