తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నట్టు తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇటీవల కురుసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సాగనుంది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించినున్నట్టు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వడగండ్ల వర్షం సృష్టించిన బీభత్సం వల్ల మొక్కజొన్న, వరి, మిర్చితో పాటు పలురకాల పంటలు నాశనం అయిపోయాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతాంగం గగ్గోలు పెడ్తోంది. దీంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని భావించిన ముఖ్యమంత్రి ముందుగా పంట నష్టం వివరాలను తెప్పించుకున్నారు. ఈ మేరకు మంగళవారం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంఓకు పంట నష్టం వివరాలను పంపించారు. నివేదికలను ఆధారం చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఏఏ జిల్లాలో ఎంతమేర నష్టం వాటిల్లిందో వివరిస్తూ సీఎం కేసీఆర్ కు విన్నవించారు. దీంతో ఆయన పర్యటన ఖమ్మం నుండి కరీంనగర్ వరకు షెడ్యూల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. హైలిక్యాప్టర్ ద్వారానే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నష్టపోయిన పంటలను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ఆయా జిల్లాల అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
https://twitter.com/TelanganaCMO/status/1638563888672444416?s=20
Disha Dasha
1884 posts
Prev Post
Next Post