బీజేపీ తొలి జాబితా విడుదల..?


దిశ దశ, హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో పడింది. కొద్ది సేపటి క్రితం తొలి జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. తొలి జాబితాలో 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం ఎంపీలుగా ప్రాతినిథ్య వహిస్తున్న నలుగురు బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం గమనార్హం. బీజేపీ విడుదల చేసిన జాబితాలో అంబర్ పేట నుండి జి కిషన్ రెడ్డి, ఆర్మూర్ నుండి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుండి బండి సంజయ్, బోథ్ నుండి సోయం బాపురావు, దుబ్బాక నుండి ఎం రఘునందన్ రావు, హుజురాబాద్ నుండి ఈటల రాజేందర్, మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి లాలల ఎం ప్రకాష్ జైశ్వాల్, నిర్మల్ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ నుండి రాథోడ్ రమేష్, సిర్పూర్ నుండి పాల్వాయి హరిష్ బాబుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన లేఖ వైరల్ అవుతోంది. అయితే ఇంతవరకు బీజేపీ నాయకత్వం మాత్రం అధికారికంగా విడుదల చేయలేదు.

అదంతా ఫేక్: ఎంపీ అరవింద్

బీజేపీ కేంద్ర కార్యాలయం జారీ చేసినట్టుగా ప్రచారమవుతున్న ఈ కింది లిస్ట్ ఫేక్ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్ చేశారు. ఇలాంటి ప్రకటన అనేది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జారీ చేయలేదంటూ ట్విట్ చేశారు.

You cannot copy content of this page