కటకం సుదర్శన్ చివరి ప్రకటన ఇదే…

దిశ దశ, దండకారణ్యం:

మే 31న అనారోగ్యంతో మృత్యువాత పడిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ దూల దాదా అంతిమ క్షణాలకు ముందు విడుదల చేసిన ఈ ప్రకటనలో పలు అంశాలను ఊటంకించారు. విప్లవోద్యమంపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. దూల దాదా చివరి సారిగా పంచుకున్న తన భావాలకు సంబంధించిన ప్రకటనను మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. విప్లవ పార్టీ మంత్రసాని తనం పాత్ర పోషిస్తుందని, ప్రజలు మరింత గట్టిగా నిలిచి విజయం కోసం తప్పక పోరాడుతారని సుదర్శన్ అభిప్రాయపడ్డారు. తాను ఎంచుకున్న విప్లవ పోరాటంతో బలవంతమైన పునాదులు అయితే పడ్డాయని, నూతన ప్రజాస్వామిక విప్లవం పూర్తి స్థాయిలో సాధించకపోయినప్పటికీ ఆ మార్గంలో తాను చాలా ముందుకు నడిచానని అభిప్రాయపడ్డారు.

కటకం సుదర్శన్ రాసిన లేఖ పూర్తి పాఠం

నేను విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాను. ఎంచుకున్న మార్గంలో ప్రయాణించి దేశంలో విప్లవోద్యమ పురోగమనంలో నా వంతు బాధ్యతను నెరవేర్చాను. అయితే దేశంలో విప్లవ పునాదులు బలంగా పడినాయి. కాని విప్లవోద్యమం పూర్తి అయి, మనం కోరుకున్న సమాజం, అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం, సోషలిజం రాకపోయినప్పటికీ ఆ మార్గంలో చాలా ముందుకు నడిచాను. ఒక గొప్ప మార్పు మనం కోరుకున్నప్పుడే సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా విప్లవోద్యమ విజయానికి అనేక అంశాలు తోడు కావలసి వుంటుంది. ముందుకొచ్చినప్పుడే విజయవంతమవుతుంది. ప్రధానంగా ప్రజలు విప్లవోద్యమం రాబోయే రోజుల్లో ప్రజలు మరింత గట్టిగా నిలిచి తప్పక విజయం కోసం పోరాడుతారు. అందులో సందేహం లేదు. ప్రజలే విప్లవోద్యమానికి నిజమైన కర్తలు. కొత్త బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి మంత్రసాని లాంటి పని పార్టీ చేస్తుంది. ఈ కర్తవ్యాన్ని పార్టీ గొప్పగా ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్ని పాట్లు పడినా ప్రజలను మభ్య పెట్టలేరు. పాలకవర్గాలైన సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలను అధికారం నుండి కూలదోసి దేశంలో కార్మికవర్గ నేతృత్వంలో విప్లవాన్ని విజయవంతం చేయడం ఖాయం. ఈ విశ్వాసంతో మీరంతా వుండాలి. అందుకు మన కుటుంబం విప్లవ విశ్వాసంతో తోచిన పద్దతుల్లో నిలబడుతుందని, విప్లవ సాంప్రదాయాలకు ఎలాంటి హాని జరగకుండా ప్రవర్తిస్తారని బలంగా కోరుకుంటూ…

You cannot copy content of this page