ఉదయం నుండి హై డ్రామా మధ్య కొనసాగిన ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ విషయంలో చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమ భరత్ ద్వారా ఆమె ఈడీ అసిస్టెంట్ డైరక్టర్ జోగేందర్ కు లేఖ పంపించారు. మీరు అడిగిన బ్యాంకు అకౌంట్లతో వివరాలతో పటు బిజినెస్, పర్సనల్ డిటైల్స్ పంపిస్తున్నాని లేఖలో వివరించారు. అలాగే ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే తాను పంపించిన అతని ద్వారా అయినా అడగొచ్చని, లేనట్టయితే మెయిల్ ద్వారా కూడా కోరవచ్చని కవిత ఆ లేఖలో సూచించారు. తాను సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ 103 ఆఫ్ 2023పై ఈ నెల 24న హియరింగ్ ఉన్నదన్నారు. చాలా విషయాలను ప్రస్తుతించిన కవిత పంపిన లేఖను కూడా ఈ కిందలో పేర్కొన్న అంశాలివే… మొత్తం ఆరు పేజీల లేఖ ‘దిశ దశ’ పాఠకులకు ప్రత్యేకం