ఇంటి దగ్గరి వాడే ఇంత పని చేస్తాడనుకోలేదు… పెళ్లి చేసుకోనన్నందుకే దాడి…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో గురువారం రాత్రి ఓ యువతిపై దాడి చేసిన ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలి ఇంటి పక్కన ఉండే సాయి అనే యువకుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆమె నిరాకరించడం వల్లే కత్తితో దాడికి పాల్పడినట్టుగా గుర్తించారు. తాను ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకోవాలని సాయి అనే యువకుడు బాధితురాలిని కొద్ది రోజుల క్రితం అడగగా, ఆమె నిరాకరించింది. దీంతో బాధితురాలిపై కోపం పెంచుకున్న సాయి గురువారం రాత్రి ఆమెపై దాడి చేసి పరార్ అయ్యాడు. కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ఱాకర్ రావు  బాధితురాలికి చికిత్స అందిస్తున్న మీనాక్షి   ఆసుపత్రికి చేరుకుని ఘటనకు సంబంధించిన పుర్వాపరాలను తెలుసుకున్నారు. నిందితుడు సాయి పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారని తెలిపారు. గతంలో కూడా బాధితురాలిని వివాహం చేసుకుంటానని సాయి ఇబ్బందులు పెట్టడంతో పెద్దల సమక్షంలో కూడా పంచాయితీలు జరగినా కూడా అమ్మాయి మాత్రం అతన్ని పెళ్లి చేసుకనేందుకు ఒప్పుకోలేదని ఏసీపీ వివరించారు. గత వారం రోజులుగా అమ్మాయి తండ్రికి కూడా మెసేజ్ చేస్తూ తానే పెళ్లి చేసుకుంటానని మరోకరితో పెళ్లి చేయవద్దంటూ కోరుతున్నాడని వివరించారు. అయితే సాయితో వివాహం చేసుకునేందుకు అమ్మాయితో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇంట్రస్ట్ లేదని చెప్పారన్నారు. దీంతో గురువారం సాయంత్రం బాధితురాలు ఇంట్లో ఉండగా అక్కడ ఎవరూ లేరన్న విషయాన్ని గమనించి ఆమెపై దాడికి పాల్పడినట్టు తాండ్ర కర్ణాకర్ రావు వివరించారు. ఈ దాడిలో గొంతుపై రెండు చోట్ల గాయాలు కాగా దాడి నుండి తప్పించుకుంటున్న క్రమంలో బాధితురాలు చేయిని అడ్డం పెట్టడంతో చేయికి కూడా గాయమైందని వివరించారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపామని ఏసీపీ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు.

పరారీలో ఉన్న నిందితుడు సాయి

You cannot copy content of this page