దిశ దశ, జాతీయం:
వినాయక నవరాత్రులు అనగానే చాలా మంది అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం… శోభాయాత్రలు నిర్వహించడంతోనే సరిపెడుతుంటారు. కానీ అక్కడి వినాయక ఉత్సవాలకు మాత్రం ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. దేశంలోనే గణేష్ ఉత్సవాలు నిర్వహించడంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ముంబాయి నగరం స్పెషాలిటియే వేరు. అందులో కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో చేపట్టే ఉత్సవాల ప్రత్యేకత అన్నింటికన్నా హైలెట్ అని చెప్పాలి. GSB సేవా మండల్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేసే విఘ్నేశ్వరుని ప్రతిమ బంగారం, వెండితో ఆలంకారం చేస్తుంటారు. 1950వ దశాబ్దంలో ప్రారంభం అయిన ఈ ఉత్సవ కమిటీ ఏటేటా నవరాత్రులు నిర్వహించేందుకు అత్యంత పాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఇన్సూరెన్స్ కూడా చేయిస్తుంటారు నిర్వహాకులు. గత సంవత్సరం కింగ్స్ సర్కిల్ లో GSB సేవా మండల్ చేపట్టే ఈ కార్యక్రమం కోసం రూ. 360 కోట్లకు పైగా భీమా చేశారు. ఈ ఏడాది 400.58 కోట్లకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. ఇక్కడ పనిచేసే వారితో పాటు బంగారు, వెండి, ఇతరాత్ర విలువైన వాటి కోసం ఈ భీమా చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. సెప్టెంబర్ 5న కింగ్స్ సర్కిల్ లో వినాయక ఉత్సవాలను GSB సేవా మండల్ లాంఛనంగా ప్రారంభించనుంది.