అంతటా సీతా రాముల కళ్యాణం…

అక్కడ మాత్రం స్పెషల్ ఇదే…!

దిశ దశ, వేములవాడ:

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న ఆ క్షేత్రం ఎన్నో వైవిద్యతలను సంతరించుకుంది. చాళుక్యుల రాజధాని అయిన వేములవాడ రాజన్న ఆలయం కేవలం శైవ క్షేత్రమే కాదు హరిహర క్షేత్రం కూడా. అయితే ఎన్నో వైవిద్యతలను తనలో ఇముడ్చుకున్న ఈ క్షేత్రంలో శివ కళ్యాణం ఎంత గ్రాండ్ గా జరుగుతుందో సీతారాముల కళ్యాణం కూడా అంతే రేంజ్ లో జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటికీ ఈ తరం కూడా పాటిస్తోంది. అయితే వీటన్నింటికన్నా మరో ప్రత్యేకత వేములవాడ రాజన్న క్షేత్రంలో మరోకటి ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంతో పాటు ట్రాన్స్ జెండర్స్ వివాహం కూడా గ్రాండ్ గా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ట్రాన్స్ జెండర్స్ శ్రీరామనవమికి ఒక రోజు ముందే శివయ్య సన్నిధికి చేరుకుంటారు. శ్రీరామనవమి రోజున పెళ్లి కూతుర్లను మరిపించే విధంగా ముస్తాబై వీరు తలంబ్రాలు, మంగళ సూత్రాలు తమ వెంట తీసుకుని ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. కళ్యాణ వేదిక వద్ద సీతారాముల కళ్యాణం తంతు ఎలా జరిగితే అలాగే వీరు అలాగే కొనసాగిస్తుంటారు. తలంబ్రాలు పోయడం, మంగళ సూత్రాలు కట్టుకోవడం ఇలా ప్రతిది కూడా అదే ముహుర్తానికి జరుపుకుంటుంటారు. ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ, తాళి కట్టుకుంటూ వివాహ కార్యక్రమాని కంప్లీట్ చేసుకుంటారు. సీతారాముల తలపై తలంబ్రాలు పడిన మరుక్షణం వీరు అదే ఆలయ ప్రాంగణంలో తలంబ్రాలు పోసుకుంటారు.

ఏటా ఇదే తంతు…

ప్రతి ఏటా కూడా ఇదే విధానంతో తాము ముందుకు సాగుతారు ట్రాన్స్ జెండర్స్. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా కూడా వేములవాడ చేరుకుని వివాహ కార్యక్రమం ముగించుకుని తాము స్వామివారికే అంకితం అవుతున్నామని మాట ఇచ్చి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటారు. అయితే సాధారణంగా దేశంలో ఏ క్షేత్రంలోనే సీతారామచంద్రుల కళ్యాణం హైలెట్ గా నిలిస్తే వేమలవాడ రాజన్న ఆలయంలో అటు సీతారామచంద్రుల పెళ్లి… ఇటు థర్డ్ జెండర్స్ మ్యారేజీ స్పెషల్ హైలెట్ అని చెప్పాలి. వేలాది మంది థర్డ్ జెండర్స్ వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకుని ఈ తంతు పూర్తి చేస్తుంటారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా థర్డ్ జెండర్స్ తోనే కిటకిటలాడిపోతుంటుంది. సాధారణంగా వేములవాడ అనగానే రాజరాజేశ్వర స్వామి అందరికి గుర్తుకు వస్తుంటాడు కానీ శ్రీరామ నవమి రోజున థర్డ్ జెండర్స్ మ్యారేజ్ హంగామా అంటే చాలా తక్కువ మందికే తెలుసు.

వీరు కూడా…

మరో వైపున జోగినీలు, శివ సత్తులు కూడా తమ జీవితం నీకే అంకితమన్న రీతిలో స్వామి వారిని పెళ్లాడుతుంటారు. ఏటా శ్రీరామనవమి రోజున వీరంతా కూడా శివయ్యను పెళ్లి చేసుకుంటున్న ఆనవాయితీగా అనాదిగా వస్తోంది.

You cannot copy content of this page