వరంగల్ బీజేపీ లీగల్ టీమ్ ఇదే…

ఉత్కంఠకు వరంగల్ లీగల్ టీం తెర

సంచలనంగా మారిన అడ్వకేట్స్ వాదనలు

అభినందనల వెల్లువ

దిశ దశ, వరంగల్:

ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణల తప్పని చెప్పి బెయిల్ వచ్చేలా మా ఆర్గ్యూమెంట్స్ ఉంటాయంటూ గురువారం ఉదయం బీజేపీ లీగల్ టీం రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రాసిక్యూషన్ చేస్తున్న ఆరోపణలు ఏంటీ వాటిలో ఉన్న లోపాలు ఏంటీ..? ఈ కేసులో బండి సంజయ్ పై పెట్టిన సెక్షన్లు వర్తిస్తాయా..? ఆయనను ఏ1గా రిమాండ్ సీడీలో ఎలా పేర్కొన్నారు, అసలు కేసు పూర్వాపరాలేంటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది వరంగల్ బీజేపీ లీగల్ టీమ్. దాదాపు 12 మంది అడ్వకేట్లు వరంగల్ పోలీసులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన రిమాండ్ సీడీ, ఎఫ్ఐఆర్ కాపీలోని అంశాలను కులంకశంగా చదివి లోపాలను ఎత్తి చూపుతూ, ఎప్పటికప్పుడు సుదీర్ఘం వాదనలు బెంచ్ ముందు వినిపించారు. సుమారు 8 నుండి 9 గంటల పాటు నిర్విరామంగా వాదనలు వినిపించి చివరకు సఫలం అయ్యారు. కస్టడీ పిటిషన్ పెండింగ్ లో ఉందన్న కారణాన్ని చూపినా కౌంటర్ గా వాదనలు వినిపించారు. గురువారం రాత్రి వరకూ సాగిన ఈ వాదనలతో సర్వత్రా ఉత్కంఠత నెలకొందనే చెప్పాలి. ఒక దశలో బెయిల్ ఇవ్వకున్నా మంచిదే రిజక్ట్ అయితే కానివ్వండి హై కోర్టుకు వెల్దామన్న ప్రతిపాదనలు కూడా పార్టీ అధిష్టానం వరంగల్ లీగల్ టీం ముందు ఉంచింది… అయితే బెయిల్ ఇవ్వండి లేదంటే రిజక్ట్ చేయండి కానీ పెండింగ్ లో పెట్టకండని వరంగల్ బీజేపీ న్యాయవాదుల బృందం కోర్టులో వాదించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని రోజుల తరబడి జైళ్లో ఉంచే ప్రసక్తే లేదు, ప్రాసిక్యూషన్ లోపాలను బెంచ్ ముందు ఎత్తి చూపి సక్సెస్ అయి తీరుతామంటూ అత్యంత నమ్మకంగా చెప్పినట్టుగానే సాధించారు. శుక్రవారం బండి సంజయ్ అత్తమ్మ పెద్దకర్మ, 8న ప్రధాని మోడీ టూర్ ఉన్నందున బెయిల్ ఇవ్వాలని బీజేపీ లీగల్ టీమ్ అభ్యర్థించింది. అయితే పేపర్ లీకేజ్ విషయంలో పోలీసులు జరిపే దర్యాప్తుకు సంజయ్ సంపూర్ణంగా సహకరిస్తారని కూడా న్యాయవాదుల బృందం కోర్టుకు తెలిపింది. టీమ్ వర్క్ తో ఎప్పటికప్పుడు ప్రాసిక్యూషన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చివరకు బెయిల్ ఇచ్చే వరకూ వరంగల్ న్యాయవాదుల బృందం తమ వాదనలు వినిపించింది. గురువారం ఉదయం నుండే బండి సంజయ్ కి బెయిల్ వస్తుందో రాదోనన్న ఆందోళనలో పార్టీ వర్గాలు కొట్టుమిట్టాడాయి. సమయం గడిచినా కొద్ది ఇక ఈరోజుకు ఇంతే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు, సోమవారం వరకూ వెయిట్ చేయాల్సిందేనా అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఉత్కంఠత వ్యక్తమయింది పార్టీ శ్రేణుల్లో. హన్మకొండ అదాలత్ వద్ద, కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఎదురు రాత్రి వరకు ఎదరు చూస్తూ బెయిల్ వస్తుందా రాదా అన్న విషయంపై తీవ్రంగా చర్చించారు. సంజయ్ బెయిల్ విషయంలో స్టేట్ మీడియా వర్గాల్లోనూ తర్జనభర్జనలు సాగాయి. రాత్రి 10 అవుతోంది ఇక ఈ రోజుకు ఇంతే బెయిల్ రావడం కష్టమే అనుకున్నారంతా. అంతలోనే వరంగల్ జిల్లా కోర్టు సముదాయం నుండి బీజేపీ శ్రేణులను ఊరడించే వార్త బయటకు వచ్చేసింది. బండి సంజయ్ కి కండిషన్ బెయిల్ వచ్చిందన్న వార్త దావణంలో వ్యాపించింది. బండి సంజయ్ కి బెయిల్ వచ్చింది అన్న సమాచారం రాగానే బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చేసింది. బెయల్ సాంక్షన్ అయిన వెంటనే ఆర్డర్ కరీంనగర్ కు చేరవేసే వరకూ వరంగల్ అడ్వకేట్స్ టీమ్ నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. చివరకు పార్టీ నేత సంజయ్ ని బెయిల్ పై విడిపించడంలో సక్సెస్ కాగలిగామని అడ్వకేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్ కి బెయిల్ వచ్చిందన్న విషయంపై ఎంత చర్చ సాగుతోందో… ఇందుకోసం తీవ్రంగా శ్రమించిన ఈ అడ్వకేట్స్ బృందం గురించి కూడా అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ అవుతుండడం విశేషం.

You cannot copy content of this page