ఛాలెంజ్ అయినా రివైంజ్ అయినా వారే… ఆ రెండు చోట్ల డిఫరెంట్ పాలిటిక్స్…

దిశ దశ, హైదరాబాద్:

లోకసభ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో వైవిద్యమైన రాజకీయాలు సాగుతున్నాయి. అధికారిక అభ్యర్థులు వేరే వారయినా విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రం వారిద్దరి కేంద్రీకృతంగానే సాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలంటేనే ఠక్కున గుర్తుకొచ్చే ఆ రెండు లోకసభ స్థానాల్లో నెలకొన్న పరిస్థితులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కరీంనగర్ పొన్నం…

కరీంనగర్ లోకసభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొంతకాలంగా కరీంనగర్ ప్రజలకు దూరంగా ఉన్న వెలిచాల రాజేందర్ రావు లోకసభ ఎన్నికలతో మళ్లీ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కరీంనగర్ ప్రజలకు దూరం అయిన రాజేందర్ రావుకు టికెట్ ఇవ్వడం తమకు లాభించనుందని ప్రత్యర్థి పార్టీలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా కరీంనగర్ ప్రజలకు అసలే తెలియని  రాజేందర్ రావుకు టికెట్ ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కరీంనగర్, వేములవాడ సెంటర్లలో కండువా లేకుండా రాజేందర్ రావును నిలబెడితే ఆయనను గుర్తు కూడా పట్టరంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపున ఏడు సెగ్మెంట్లలో జరుగుతున్న ప్రచారంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పదునైన వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులపై విరుచుకపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పలుమార్లు పొన్నం ప్రభకార్ ను కార్నర్ చేస్తూ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా పొన్నం ప్రభాకర్ స్పందిస్తున్నారు. దీంతో కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో పొన్నం వర్సెస్ బండి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.  ప్రచార పర్వం అంతా కూడా  రాజేందర్ రావు కంటే ఎక్కువగా పొన్నం ప్రభాకర్ లక్ష్యంగానే సాగుతుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

వరంగల్ కడియం…

వరంగల్ లోకసభ పరిధిలో కూడా డిఫరెంట్ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీల వార్ మాత్రం శ్రీహరితోనే సాగుతోంది. కడియం శ్రీహరి లక్ష్యంగానే ప్రత్యర్థి పార్టీలు విరుచకపడుతున్నాయి. ఇందుకు ఆయన కూడా కౌంటర్ ఇస్తూ హైలెట్ గా నిలుస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో కూడా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. ఆయన త్వరలోనే రాజకీయ సమాధి అవుతారని, మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరుగుతాయంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్ లోకసభ ఎన్నికల ప్ర,చారాంలో పాల్గొన్నప్పటికీ కేసీఆర్ మాత్రం స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికల గురించే మాట్లాడాడం గమనార్హం. మరో వైపున స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా కడియంపై రివైంజ్ తీసుకోవాలని ఊగిపోతోంది. మరో వైపున బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ కూడా కడియం శ్రీహరినే కార్నర్ చేస్తూ మాటలతో దాడి చేస్తున్నారు. దీంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్య కంటే ఎక్కువగా శ్రీహరి భాగస్వామ్యమే కనిపిస్తోంది. అఫిషియల్ క్యాండెడ్ కంటే ఎక్కువగా శ్రీహరి సెంటారాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులకంటే ఈ ఇద్దరు నాయకులే క్యాండెట్లు అన్నట్టుగా మారిపోయింది. పొలిటికల్ సీన్ లో వీరిద్దరే కనిపిస్తుండడంతో అసలు అభ్యర్థులు నామ మాత్రంగా మారిపోయారన్న చర్చ కూడా సాగుతోంది.

You cannot copy content of this page