ముచ్చెమటలు పట్టిస్తున్నమునుగోడు…

ఆ ఓట్లే కీలకంగా మారిన వైనం…

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న విషయంలో ఇప్పటికీ కొన్ని సర్వే ఏజెన్సీలు క్లారిటీగా టీఆరెఎస్ గెలుపు ఖాయమని తేల్చేశాయి. అధికార టీఆరెఎస్ పార్టీలో కూడా ఇదే ధీమా వ్యక్తం అవుతున్నప్పటికీ నిఘా వర్దాలు మాత్రం ఆ సమయంలో జరిగిన పోలీంగ్ ఎటు వైపు మొగ్గు చూపి ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డాయి. పబ్లిక్ పల్స్ తెలుసుకునే పనిలో నిమగ్నమైన నిఘా వర్గాలు మరిన్ని కోణాల్లోనూ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.

7పీఎం తరువాతే

ఈ ఉప ఎన్నికల్లో రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం అత్యంత కీలకంగా మారిపోయింది. ఆ సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్ లో పాల్గొన్న వారు ఎటు వైపు మొగ్గారన్నదే మిస్టరీగా మారిపోయింది. దాదాపు 230 బూతుల్లో రాత్రి వేళల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయింది. హైదరాబాద్ మహానగరంలో ఉన్న వారంతా సాయంత్రం బూతుల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలబడడంతో రాత్రి 10 గంటల వరకూ నిరాటంకంగా పోలింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగించాల్సి వచ్చింది. 5 గంటల వరకు జరిగిన పోలింగ్ కు హాజరైన ఓటర్ల పల్స్ కన్నా రాత్రి పూట జరిగిన వారి పల్స్ పై స్పష్టత లేకుండా పోయిందన్నది వాస్తవం. అయితే వీరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు..? మెజార్టీ మొగ్గు ఎటు వైపు ఉంది అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ నుండి వచ్చి ఓటు వేయడంతో వారి మద్దతు ఎవరికి ఉందన్న విషయంపై ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయింది. వీరితో పాటు స్తానికంగా ఉన్నప్పటికీ సాయంత్రం తరువాతే ఓటింగ్ వేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. రాత్రి 3 గంటల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియనే అభ్యర్థుల తల రాతలు మారుస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఓటర్లూ కీలకమే…

అయితే మునుగోడు ఓటర్ల మనోగతం అంతు చిక్కకుండా వ్యవహరించారన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ రోజున పైకి ఫలనా పార్టీకి వేశామని చెప్పినప్పటికీ లోపల ఎవరికి ఓటు వేశారోనన్న విషయమూ అర్థం కాకుండాపోయింది ఆరా తీసే వారికి. కొంతమంది మాత్రం పొలింగ్ మరునాడు తమ లోపలి విషయాన్ని బయటకు చెప్పడంతో అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. నిఘా వర్గాలు కూడా పోలింగ్ కు ముందు పోలింగ్ తరువాత పబ్లిక్ పల్స్ తీసుకుని పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. అందరిలా తానూ ఓటేశానని బయటకు చెప్పిన చాలా మంది ఓటర్లు కూడా వాస్తవం బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని వీరి మద్దతు ఎవరి వైపు ఉందో తేలాల్సి ఉంది.

టెంపో అలాగే సాగితే…

సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు మొదట ఇచ్చినట్టుగానే ఫలితాలు వచ్చినట్టయితే సాయంత్రం వరకూ ఉన్న పబ్లిక్ పల్స్ యథావిధిగా కొనసాగిందని భావించవచ్చని అంటున్నారు. అత్యంత కీలకంగా మారిన ఈ ఓటర్ల గురించి పూర్తిగా స్పష్టత రావాలంటే మాత్రం ఈవీఎంలు లెక్కించడమే. అయితే పోలింగ్ రోజుకు ఇప్పటికీ వేసుకున్న అంచనాలు మాత్రం తలకిందులు అవుతాయా లేక మెజార్టీ విషయంలో హెచ్చు తగ్గులుంటాయా అన్న విషయంపై మాత్రం ప్రధాన పార్టీల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

You cannot copy content of this page