ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్… ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు క్రైం నంబర్ 205/2024లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు, A2గా మాజీ డీసీపీ రాధా కిషన్ రావులను చేర్చారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ మీడియాకు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో భవానీ కమ్యూనికేషన్స్ యజమాని తొడుపునూరి సంతోష్ కుమార్ (35), నారాయణరావుపేటకు వాసి ప్రస్తుతం సిద్దిపేట సీతారాంనగర్ లో నివాసం ఉంటున్న కారు డ్రైవర్ బండి పరుశు రాములు (34), నల్గొండ జిల్లాలో ఆరోగ్య శ్రీ మేనేజర్ గా పనిచేసిన సిద్దిపేట పట్టణంలోని రాంనగర్ నివాసి టి వంశీకష్ణ (37)లను అరెస్ట్ చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ పై అక్రమ నిఘా వేయడం, కొత్త నంబర్ల ద్వారా వాట్సప్ ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తు హెచ్చరికలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. భవాని కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్ కుమార్ సంబంధం లేని వ్యక్తులు ఇచ్చిన ఐడీ ప్రూప్స్ ద్వారా సిమ్ కార్డు ఇచ్చారని, ఓ గ్రామస్తుడికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పర్శరాములు, వంశీకృష్ణలతో పాటు మరికొంతమంది సేకరించారని పోలీసులు తెలిపారు. ఈ ఐడీ ప్రూఫ్స్ ద్వారా సిమ్ కార్డులను తీసుకున్న వీరు చక్రధర్ గౌడ్ సిద్దిపేట ప్రాంతంలో నిర్వహించిన సామాజిక కార్యకలాపాలను నిలవురించేందుకు బెదిరింపులకు పాల్పడే వారన్నారు. ఆరోపణల నేపథ్యంలో వంశీకృష్ణను ఉద్యోగం నుండి తీసుకున్న తరువాత మళ్లీ ఉధ్యోగం కల్పించారని ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించిన తరువాత హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్టు పోలీసులు వెల్లడించారు.

You cannot copy content of this page