ఈతకు వెల్లి ముగ్గురు చిన్నారుల మృత్యువాత

దిశ దశ, పెద్దపల్లి:

ఈత నేర్చుకునేందుకు వెల్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది. స్కూలుకు సెలవు కావడంతో స్థానిక చెరువులో ఈత కొట్టేందుకు వెల్లి 8వ తరగతి విద్యార్థులు చనిపోవడంతో విషాదం అలుముకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ న్యూ పోరెట్ పల్లి చెరువులో ముగ్గురు విద్యార్థులు ఈత కోసమని దిగి చనిపోయారు. స్థానిక జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న సాయి చరణ్, ఉమా మహేష్, విక్రమ్ లు చెరువులో పడి చనిపోయారు. వీరితో పాటు వెల్లిన మరో విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తెలిసింది. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీసి గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మిన్నంటిన రోధనలు

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు క్లాస్ మెట్స్ ఈత కోసం వెల్లి చనిపోవడంతో గోదావరిఖని ఆస్పత్రి ఆవరణలో రోధనలు మిన్నంటిపోయాయి. ఉన్నత శిఖరాలకు చేరుతారనుకున్న తమ ఆశల సౌధాలు చెరువులో మరణించారన్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణ అంతా కూడా వారి కుటుంబ సభ్యుల రోధనలతో నిండిపోయింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలితీసుకున్న తీరును చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

You cannot copy content of this page