మూడు రోజులైన దొరకని ఆచూకి…
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నతల్లిదండ్రలు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో మూడు రోజుల క్రితం మధ్య ప్రదేష్ కు చెందిన మూడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. ఇంటి నుండి బయటకు వెల్లిన చిన్నారి ఆచూకి లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ రాంనగర్ సమీపంలోని హరిహరనగర్ లో నిర్మాణ పనుల కోసం మధ్యప్రదేష్ లోని బాలాఘాట్ ఏరియా నుండి కార్మికులు కొంతమంది వలస వచ్చారు. ఈ నెల 27న చిన్నారి కృతిక (3) అదృశ్యం అయింది. సీసీ ఫుటేజీలో బయకుటకు నడుచుకుంటూ వెల్తున్నట్టుగా రికార్డు కాగా ఆ తరువాత పాపా ఎక్కడికెల్లింది అన్నది అంతుచిక్కకుండా పోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా గాలిస్తున్నపటికీ చిన్నారి ఆచూకి మాత్రం చిక్కడం లేదు. భారీ వర్షాలు కూడా ఉన్న సమయంలో చిన్నారి బయటకు వెల్లడంతో వరద నీటిలో చిక్కుని ఉంటుందా లేక… ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.
