తుమ్మిడిహడ్డి వద్ద నిర్మాణం చేస్తాం మంత్రి ఉత్తమ్

దిశ దశ, మంథని:

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన తుమ్మిడి హడ్డి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తీరుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీని శుక్రవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తుమ్మిడి హడ్డి నిర్మిస్తామని చెప్పామని, ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పై ఫోకస్ పెట్టామని, కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం లోపాలున్నాయనీ బయటపెట్టలేదని మంత్రి తెలిపారు. కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టు, బ్యారేజి లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. NDSA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం పునరుద్దరణ చేయబడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి పనులను పరిశీలించే బాధ్యత అప్పజెప్పమన్నారు. టెస్ట్, ఏ పనులు చేయాలో NDSA తెలిపింది.
ఎన్నికల సందర్భంగా పనుల పరిశీలన వీలుకాలేదని, కంపెనీలకి అప్పజెప్పామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామన్నారు. జస్టీస్ ఘోష్ కమీషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తున్నామని వివరించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద రిపేర్ చేయాల్సిన మిగిలిన 11 మోటార్లు కూడా బాగుచేశాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

You cannot copy content of this page