అన్నల కోసం అట్టుడికిపోయే ఆ ప్రాంత అడవులు ఇప్పుడు మరో కారణంగా ఆందోళనకు గురవుతున్నాయి. నక్సల్స్ ఏరివేత కోసం తిరిగే బూట్ల చప్పుళ్లకు బదులు ఇప్పుడు అటవీ అధికారుల వేట కారణంగా బిజీబిజీ అయ్యాయి. చీకటి పడితే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం బిక్కు బిక్కుమంటూ అక్కడి జనం భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో సరిహద్దు అటవీ ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అటవీ అధికారులు దాని జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తుండగానే అది మాత్రం హాంటింగ్ మానడం లేదు. అరణ్యం నుండి జనారణ్యంలోకి… జనారణ్యం నుండి అరణ్యంలోకి తిరుగుతున్న మృగం పట్టుబడేదెలా అన్నదే పజిల్ గా మారిపోయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే…
అడుగుల జాడ…
వాంకిడీ నుండి కాగజ్ నగర్ వరకూ విస్తరించిన అడవుల్లో పులి అడగులు జాడలు దొరుకుతున్నాయి కానీ దాని ఆచూకి మాత్రం చిక్కడం లేదు. పులి అడుగులు కనిపించగానే అటవీ అధికారుహుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్లగ్ మార్క్ప్ వివరాలను సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులు గత 20 రోజులుగా వేటాడుతున్న పులి కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. పులి జీవన విధానం తీరు తెన్నులపై అవగాహన ఉండడంతో దాని లైవ్ మూవ్ మెంట్ దొరుకుతుందని ఆశించి తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలించడం లేదని తెలుస్తోంది. వాంకిడీ సమీపంలోని ఖానాపూర్ అటవీ ప్రాంతంలో 35 ట్రాప్ కెమరాలను, 50 ట్రాకర్స్ ను ఏర్పాటు చేసి అటవీ అధికారులు ఆచూకి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే దాని ప్లగ్ మార్క్స్ తప్ప లైవ్ విజువల్ మాత్రం ఎక్కడా రికార్డు కావడం లేదు. దీంతో అటవీ అధికారులతో పాటు సరిహద్దు అటవీ ప్రాంతాల వాసుల్లో సరికొత్త ఆనవాళ్లు మొదలయ్యాయి. తాజాగా కాగజ్ నగర్ సమీపంలోని ఓ గ్రామం నుండి అడవుల వైపు వెల్లినట్టుగా అడుగు జాడలు వెలుగులోకి రావడంతో షెల్టర్ జోన్ కు చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అక్కడి నుండి ప్రారంభం…
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడీ మండలం ఖానాపూర్ అటవీ ప్రాంతంలో సిడాం భీంపై పులి పంజా విసరడంతో దాని ఉనికి వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. అటవీ శాఖ అధికారులు కూడా పులి జాడ కోసం ప్రయత్నిస్తూ అడుగు జాడలను అయితే సేకరిస్తున్నారు. సేకరించిన ప్లగ్ మార్క్స్ ఆదారంగా మాత్రం ప్రాథమికంగా అవి పులు అడుగులేనని భావిస్తున్నారు. ఆ తరువాత మరిన్ని చోట్ల పశువులపై పులి పంజా విసరడంతో కలకలం లేచింది. వాంకిడీ నుండి కాగజ్ నగర్ వరకూ పులి ప్రస్థానం సాగుతుండడంతో పులా… పులులా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పులి రోజుకు 30 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిస్తుందని గణాంకాలు చెప్తున్న దృష్ట్యా ఒకే పులి అయి ఉండవచచ్చని భావిస్తున్నారు. మరోవైపున మొదటి రోజు పంజా విసిరిన పులి రక్తం తాగి రెండు మూడు రోజుల తరువాత వచ్చి మాంసం తినడం దాని నైజం. పులిసిన మాంసాన్ని పులి తింటుదని అటవీ గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ లెక్కన వాంకిడీ అటవీ ప్రాంతంలో పులి చేతిలో చిక్కి చనిపోయిన సిడాం భీం శవం వద్దకు తిరిగి పులి రాకపోవడంతో ఈ ప్రాంతంలో తిరుగుతున్నది ఒక్క పలేనా ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు సరిహద్దు ప్రాంతంలోని ప్రాజెక్టు కాలువలో రెండు పులి పిల్లలు వెల్తున్న వీడియోలు వైరల్ కావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే వివిధ ప్రాంతాల్లో సేకరించిన అడుగులను ల్యాబ్ టెస్ట్ చేయించి అవి ఒక్క పులివా లేక పులులకు చెందినవా అని నిర్దారించుకునే పనిలో పడ్డారు అటవీ అధికారులు. ల్యాబ్ లలో చేస్తున్న పరీక్షలు పూర్తయితే ఇంచుమించు వాటి వయసును కూడా అంచనా వేసే అవకాశాలు కూడా లేకపోలేదు.
అందు కొసం వచ్చాయా…?
సరిహద్దు ఫారెస్ట్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన పులులు తెలంగాణ అడవుల్లోకి రావడానికి కారణం ఏంటీ అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఈ సీజన్ లో మగ పులులు ఆడ పులి సాంగత్యం కోసం తహతహలాడుతుంటాయని అంటున్నారు. ఈ కారణంగానే మహారాష్ట్ర నుండి వచ్చిన మగ పులులు ఆడ పులి కోసం ఇక్కడకు వచ్చి చేరాయని భావిస్తున్నారు. ఇక్కడి ఆడపులి ఉనికి దొరికితే అవి అడవుల్లోంచి బయటకు వచ్చేవి కావన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపున పులి మనిషిపై పంజా విసిరి రక్తం తాగడమో లేదా మాంసాన్ని తినడమో చేసిన తరువాత దాని ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకూ అటవీ ప్రాంతాల్లో తిరిగే వన్య ప్రాణులను ఆహారంగా తిసుకున్న పులులు మనిషిని చంపి తిన్న తరువాత అవి గందరగోళానికి గురవుతాయని, మానసిక ప్రవర్తనలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు నిపుణులు. అటవీ ప్రాంతంలో లభ్యమయ్య అహారానికి మనుషులు, జానరణ్యంలో తిరిగే జంతువుల మాంసం రుచి వేరుగా ఉండడంతో అవి కొంత జిగ్ జాగ్ కు గురై ఎక్కడ పడితే అక్కడ తిరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.
షెల్టర్ కు చేరుకుందా…?
ఇప్పటి వరకు అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల్లో తిరుగుతున్న పులి తాజాగా అటవీ ప్రాంతంలోకి వెల్లిపోయినట్టుగా దాని అడుగు జాడలు చెప్తున్నాయి. దీంతో అది అటవీ ప్రాంతంలోని షెల్టర్ జోన్ కు చేరుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు అటవీ అధికారులు. దాని డెన్ కు చేరుకున్నట్టయితే మాత్రం పులి మల్లీ జనాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఏధి ఏమైనా ఆసిఫాబాద్ ప్రజలను వెంటాడుతున్న పులి భయంపై మాత్రం స్పష్టత రావల్సిన అవసరం అయితే ఉందని అటవీ అధికారులు అంటున్నారు. ఇన్ని రోజులు అడవుల్లో సంచలనంగా మారడం వెనక ఒక్క పులే ఉందా పులులు ఉన్నాయా అన్న విషయంపై క్లారిటీ రావల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది.