ఓటు కోసం బోటెక్కాల్సిందే…

దిశ దశ, జాతీయం:

ప్రజాస్వామ్య భారతంలో ఒక్కో చోట ఒక్కో తీరు కష్టాలు అన్నట్టుగా ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే తెరపైకి కనిపించే ఓటర్లు ఇంకా ఉన్నారు. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న స్వతంత్ర్య భారతంలో దారి తెన్నూ లేని ప్రాంతాలు నేటికీ సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి. తొలివిడు పోలింగ్ లో ఎన్నికల యంత్రాంగం పడ్డ కష్టాలను గమనించాం. రెండో విడుత పోలీంగ్ లో పాల్గోనే ఓటర్లు ఏరు దాటితే తప్ప ఓటేసే పరిస్థితి లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. త్రిపుర రాష్ట్రంలోని ధలై జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న రైమా వ్యాలీ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు ఓటు హక్కు వినయోగించుకోవాలంటే బోటు ఎక్కి బాహ్య ప్రపంచంలోకి రావల్సిందే. రెండో విడుత పోలింగ్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు పడవల్లో వచ్చారు అక్కడి ఓటర్లు.

You cannot copy content of this page