దిశ దశ, దండకారణ్యం:
చిన్న చిన్న గుడిసెలు… పాత కాలం నాటి ఇండ్లు… ఓ వైపున ప్రాణహిత, మరల గోదావరి పరవళ్లు ఈ ఊరి ప్రత్యేకతలు. ఇప్పుడు తాలుకా కేంద్రంగా ఉన్న ఈ ఊరు శతాబ్దం క్రితం జిల్లా కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడి నుండి పరిపాలన కూడా సాగించారు బ్రిటీష్ పాలకులు. విదర్భ ప్రాంతంలోనే ప్రత్యక్ష నాగపూర్ నుండి ఇంద్ర నది పరివాహక ప్రాంతం వరకు ఉన్న కొంత ప్రాంతాన్ని బ్రిటీష్ పాలకులు నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది చేశారు.
1890లో…
బ్రిటీష్ పాలకులు రాజ్యాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు నిజాం విషయంలో కొంత మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా నిజాం ప్రభుత్వం నుండి బ్రిటీషర్లు లాగేసుకున్నారు. ఇదే నది పరివాహక భాగాల ఖనిజ సంపద దంగా ఉన్న పరిశీలించిన పరిశీలించిన బ్రిటీష్ అధికారులు దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ సమయంలో ఇదే గోదావరి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ముందుకు సాగారు. ఈ ఐచ్ఛిక ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లో భారీగా ఖనిజ సంపద ఉన్న విషయాన్ని గమనించి ఈ ప్రాంతాన్ని వదిలేయాలని పాలకులు నిజాం ప్రభువుకు లేఖ రాయడంతో ఆయన సమ్మతించారు. దీనితో తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు 1890వ దశాబ్దం చివరలో అక్కడ జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రం 1890వ శతాబ్దంలో మొదట గోదావరి జిల్లాగా వెలుగొందింది. 1905లో గ్లాస్ పోర్డ్ అనే కలెక్టర్ సిరొంచలోని ప్రాణహిత నది ఒడ్డున కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కట్టించారు. ఈ భవనాన్ని మొత్తం అద్దాలతో నిర్మించడంతో నేటికి ఈ ప్రాంత వాసులు అద్దాల మేడగానే పిలుస్తుంటారు. ప్రస్తుతం మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (PWD) విభాగం ఆదీనంలో ఉన్న ఈ భవనం రెస్ట్ హౌజ్ గా ఉపయోగపడుతోంది. కాలక్రమేణ ఈ భవనానికి ఉన్న అద్దాలు ఒక్కొక్కటిగా పడిపోవడంతో రాళ్లు, సిమెంట్ తో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఏపీలో తూర్పు, పడమర జిల్లాలతో పాటు అంతర్వేది ప్రాంతంలో దిగువ గోదావరి జిల్లాలను ఏర్పాటు చేసిన బ్రిటీష్ పాలకులు సిరొంచ కేంద్రంగా గోదావరి జిల్లాను ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించారు.
వైవిద్యమైన తీరు…
సిరొంచ తాలుకా ప్రాంత వాసులు వైవిద్యమన పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. మొదట నిజాం పరిపాలనలో ఉండటంతో ఉర్దూ, తెలుగు భాషలపై పట్టు బిగించారు. బ్రిటీషర్స్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇంగ్లీష్ భాషపై పట్టు బిగించుకోవాల్సి వచ్చింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రావడంతో విదర్భలోని బ్రిటీష్ పాలకుల చేతుల్లో ఉన్న ప్రదేశం కూడా విముక్తి లభించింది. దీంతో ఈ ప్రాంతాన్ని మొదట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలిపి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆ తరువాత భాషా ప్రయుక్త ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలను కలుపుతూ రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం మహారాష్ట్రలో విలీనం అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలిపినప్పుడు హిందీతో అనుబంధం పెనవేసుకున్న ఇక్కడి ప్రజలు భాషా ప్రయుక్త రాష్టాలుగా ఏర్పాటు చేసిన తరువాత మరాఠి నేర్చుకోవాల్సిన పరిస్థితి తయారైంది. అయితే ముంబై నుండి సిరొంచ తాలుకా వరకు కూడా తెలుగు భాషలో 1990వ దశాబ్దం వరకు అక్కడి ప్రభుత్వం విద్యా బోధన చేసిందంటే వారికి తెలుగుతో ఎలాంటి అనుబందం పెనవేసుకుని ఉంటే అర్థం చేసుకోవచ్చు.
అనుబంధం ఇది…
అయితే నిజాం పరిపాలన సమయంలో బ్రిటీషర్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో తమకు సేవకులు అవసరమని, ఆ ప్రాంతంలో వారంతా ఆదివాసీలే కావడంతో కుటుంబాలను తరలించాలని కూడా బ్రిటీష్ అధికారులు నిజాం ప్రభుత్వానికి లేఖ రాయడంతో చెన్నూరు, మంథని, మహదేవూరు ప్రాంతాలకు చెందిన వివిధ సామాజిక వర్గాల వారిని అక్కడకు పంపించారు. నిజాం ప్రభుత్వానికి కూడా అవసరమైన సపరిచర్యలు అవసరం వందలాది కుటుంబాలకు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఈ కారణంగానే కర్ణాటకలోని గుల్బర్‌గా మహారాష్ట్రలోని సిరొంచ వరకు ఉన్న నిజాం పరిపాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే తెలుగు సంతతి ఉండడానికి కారణమైంది. ఆ సమయంలోనే మంథనికి చెందిన కొన్ని కుటుంబాలు నాగపూర్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి ప్రభుత్వ యంత్రాగంలో పని చేస్తున్న మంథని పట్టణానికి చెందిన కొంతమంది గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రి ఉత్సవాలను మొదలు పెట్టడంతో ఆ స్పూర్తిని మంథనిలో కూడా నింపాలన్న ఉద్దేశ్యంతో సిద్ది, బుద్ది సహిత వినాయక విగ్రహాలను కాగజ్ నగర్ వరకు ట్రైన్‌లో రహస్యంగా తరలించి అక్కడి నుండి ఎద్దుల బండిలో మంథనికి తీసుకవచ్చారు. 1902 సమయంలో పట్టణంలోని ఓ ఇంట్లో ఉత్సవాలు నిర్వహించిన తరువాత పెంజేరు కట్ట హారం గుడిలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
అదే ఊపిరి పోసిందా..?
అయితే భారత దేశం మొత్తానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం పరిపాలిత హైదరాబాద్ స్టేట్ కు మాత్రం విముక్తి లభించలేదు. నిజాం పరిపాలనకు చరమగీతం పాడాలంటే సాయుధ పోరాటం తప్పని సరి అని భావించారు ఆనాటి యోధులు. అందులో భాగంగానే మొదట సిరొంచ పరిసార జిల్లా ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు మంథనికి చెందిన గులుకోట శ్రీరాములు. తనతో పాటు మరికొంతమందిని కలుపుకుని అప్పటి చంద్రపూర్ (చాందా) కలెక్టర్ అనుమతి తీసుకుని అక్కడ సాయుధ పోరాట శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత చాందాలో మరో క్యాంపును ఏర్పాటు చేసి కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యోధులు వెపన్ ట్రైనింగ్ చేశారు. ఈ క్యాంపు ఇంచార్జిగా పివి నరసింహరావు బంధువు కెవి నరసింహరావు వ్యవహరించారు. ఇదే సమయంలో జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన పివి నరసింహరావు నాగపూర్‌లో కూడా విద్యాభ్యాసం చేశారు. దీంతో ఆయన కూడా ఈ క్యాంపునకు వచ్చి రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం ప్రభువు హైదరాబాద్ స్టేట్ ను భారతదేశంలో కలిపేందుకు ఒప్పుకున్నారు. నిజాం విమోచన కోసం జరిగిన పోరాటంలో చాందా, సిరొంచ కేంద్రంగా జరిగిన సాయుధ పోరు అత్యంత కీలక పాత్ర పోషించింది. చందా క్యాంపుతో ఉన్న అనుబంధమే పివి నరసింహరావుకు కలిసి వచ్చి 1957లో మంథని ఎమ్మెల్యేను చేసి ఉన్నట్లు స్థానికులు చెప్పేవారు. బ్రిటీష్ పాలనలో ఉన్న చందా, సిరొంచ ప్రాంతాల్లో స్వాతంత్ర్యానికి ముందు మంథని ప్రాంత వాసులు తరలి వెళ్లడం వల్లే సాయుధ పోరాట శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. చేసుకునేందుకు సులువైందని. ఇప్పుడు అభివృద్దికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తాలుకా కేంద్రం శతాబ్దం క్రితం జిల్లా కేంద్రంలో భాసిల్లిగా… నిజాం విముక్తి పోరాటానికి కూడా ఆశ్రయం ఇచ్చిందన్నది చరిత్ర చెప్తున్న నిజం.