డ్రగ్స్ కేసులో సిని నటి హేమ అరెస్ట్…

దిశ దశ, జాతీయం:

రేవ్ పార్టీలో లేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన టాలివుడ్ నటి హేమను బెంగుళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హేమ పోలీసుల ముందు విచారణకు హాజరైనప్పుడు, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు వెల్లినప్పుడు బురఖా ధరించి వెల్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మే 19న బెంగుళూరు సమీపంలో ఓ పాం హౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు అక్కడి పోలీసులు దాడులు చేశారు. వందమందికి పైగా అరెస్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. పోలీసులు 86 మందిని ఘటనా స్థలం నుండి అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షల కోసం షాంపిల్స్ సేకరించారు. ఇందులో తెలుగు నటి హేమ కూడా ఉందని బెంగుళూరు పోలీసులు ప్రకటించారు. ‘‘వాసుస్ బర్త్ డే’’ సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టుగా నిర్ధారణ కావడంతో పోలీసులు వారందరికి నోటీసులు జారీ చేశారు. అయితే రేవ్ పార్టీ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే తాను తన ఫాం హౌజ్ లో ఉన్నానంటూ ఓ వీడియోను కూడా హేమ రిలీజ్ చేశారు. తాను రేవ్ పార్టీలో లేనని తనపై వస్తున్న ప్రచారం అంతా తప్పేనని ఈ వీడియోలో కుండబద్దలు కొట్టారు. అయితే హేమ కూడా ఈ పార్టీలో ఉన్నట్టుగా బెంగుళూరు పోలీసులు తేల్చి చెప్పడంతో పాటు విమాన టికెట్లు కూడా హేమ హైదరాబాద్ ఫాం హౌజ్ లో లేరని వెల్లడైంది. మే 19న జారీ చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు, వినియోగంతో పాటు పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అయితే హేమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాపై ‘మా’ ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆరోపణలకు దిగారు. అయితే ఇఫ్పుడు హేమను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

You cannot copy content of this page