రేవంత్ రెడ్డి రాజ శ్యామల యాగం

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజ శ్యామల యాగం చేస్తున్నారు. గురువారం ప్రారంభం అయిన ఈ యాగం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. 27వ తేది సోమవారం పూర్ణహుతి కార్యక్రమంలో ఈ యాగం సమాప్తం కానుంది. పోలింగ్ సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి రాజ శ్యామల యాగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవల్సిన కీలక సమయంలో ఆయన ఐదు రోజుల పాటు రాజశ్యామల యాగం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహిస్తున్నట్టు రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే రాజ్యాధికారం కోసం మాత్రమే ఈ యాగాన్ని నిర్వహిస్తారని వేద పండితులు చెప్తున్నారు. గతంలో 2018 ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ శ్యామల యాగాన్ని నిర్వహించగా, ఈ ఎన్నికల సమయంలో కూడా నిర్వహించారు. నవంబర్ నెల మొదట్లో మూడు రోజుల పాటు కేసీఆర్ రాజ శ్యామల యాగం, సుబ్రమణ్య యాగం నిర్వహించారు. తాజాగా రాజ్య శ్యామల యాగాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నిర్వహిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page