కరీంనగర్ జిల్లాలోని రాజీవ్ రహదారి కొద్దిసేపటి క్రితం నుండి ట్రాఫిక్ జాంతో వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సం పురస్కరించుకుని స్థానిక లోయర్ మానేరు డ్యాంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు హాజరయ్యారు. రాజీవ్ రహదారిని ఆనుకుని ఎల్ఎండీ కాలనీ మహాత్మానగర్ ఉండడంతో ప్రముఖుల కాన్వాయిల రాకపోకలతో రద్దీగా మారింది. స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడం వల్ల కూడా వాహానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉండే సాధారణ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
